కన్నడలోకి కాజల్ – ఉపేంద్రతో ‘‘కబ్జా’’

కాజల్ అగర్వాల్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన ‘కబ్జా’ చిత్రంలో నటించనుంది..

  • Published By: sekhar ,Published On : November 25, 2019 / 07:16 AM IST
కన్నడలోకి కాజల్ – ఉపేంద్రతో ‘‘కబ్జా’’

Updated On : November 25, 2019 / 7:16 AM IST

కాజల్ అగర్వాల్ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన ‘కబ్జా’ చిత్రంలో నటించనుంది..

కాజల్ అగర్వాల్ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోంది. అక్కడ తొలి సినిమా ‘సూపర్ స్టార్’ ఉపేంద్రతో చేయనుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించి, తొలి సినిమా హీరో నందమూరి కళ్యాణ్ రామ్‌తోనే ‘ఎంఎల్ఏ’ మూవీతో 50 సినిమాల మైలురాయి దాటింది కాజల్.

‘యూనివర్సల్ స్టార్’ కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ లో నటిస్తోన్న కాజల్ కు‌ ఇప్పుడు కన్నడ నుంచి పిలుపొచ్చింది. ‘ఐ లవ్ యూ’ తర్వాత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, ఆర్.చంద్రు దర్శకత్వంలో ‘కబ్జా’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.

Image result for upendra kabza movie

అండర్‌వరల్డ్‌మాఫియా నేపధ్యంలో ‘కబ్జా’ రూపొందనుంది. ఈ సినిమాలో కాజల్, ఉపేంద్రకు జోడిగా కనిపించనుంది. అండర్ వరల్డ్‌బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగుతుందని, ఉపేంద్ర ‘ఓం’ సినిమా తరహాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని చెప్తున్నారు. బాలీవుడ్‌నటుడు నానా పటేకర్‌ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నారని సమాచారం. కన్నడ, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ.. మొత్తం ఏడు భాషల్లో రూపొందనుంది.