Kamal Haasan : ఇండియన్ 2 సెట్స్ నుంచి ఫోటో లీక్ చేసిన కమల్..

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ (భారతీయుడు)సినిమాకి సీక్వెల్ గా దాదాపు 25 ఏళ్ళ తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుంది. స్టార్ కాస్ట్ తో భారీగా...................

Kamal Haasan : ఇండియన్ 2 సెట్స్ నుంచి ఫోటో లీక్ చేసిన కమల్..

Kamal Haasan shares a pic from Indian 2 sets

Updated On : March 10, 2023 / 9:03 AM IST

Kamal Haasan :  కమల్ హాసన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. గత కొన్నాళ్లుగా విజయాలు చూడని కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఏకంగా 400 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించారు కమల్. విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. విక్రమ్ సినిమా తర్వాత మళ్ళీ సూపర్ ఫాస్ట్ గా పలు సినిమాలు ఓకే చేస్తూ షూట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ (భారతీయుడు)సినిమాకి సీక్వెల్ గా దాదాపు 25 ఏళ్ళ తర్వాత ఈ సినిమా తెరకెక్కుతుంది. స్టార్ కాస్ట్ తో భారీగా ఇండియన్ 2 తెరకెక్కుతుంది. వరుసగా షూటింగ్స్ షెడ్యూల్స్ వేస్తూ చాలా ఫాస్ట్ గా షూట్ చేస్తున్నారు. మొన్నటివరకు ఆంధ్రాలో జరిగిన ఈ సినిమా షూట్ ప్రస్తుతం ఆఫ్రికాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

Alia-Ranbir : ఫొటోగ్రాఫర్స్ పై ఫైర్ అయిన అలియా, రణబీర్.. కోర్టుకు వెళతాం అంటూ హెచ్చరిక..

తాజాగా ఈ సెట్ నుంచి కమల్ హాసన్ ఓ ఫోటోని షేర్ చేశారు. పలువురు ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ తో కమల్ హాసన్ ముచ్చటిస్తున్న ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇండియన్ 2 యాక్షన్ టీం, చాలా వేగంగా యాక్షన్ సన్నివేశాలు షూట్ జరుగుతున్నాయి అని పోస్ట్ చేశారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అంతా ఇండియన్ 2 అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీషర్ట్స్ వేసుకున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోతో ఇండైరెక్ట్ గా ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు చెప్తున్నారు కమల్. ఇక ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇండియన్ 2 సినిమా 2023 చివర్లో రానున్నట్టు సమాచారం.

View this post on Instagram

A post shared by Kamal Haasan (@ikamalhaasan)