Chiyaan Vikram: హీరో విక్రమ్ హెల్త్ బులెటిన్ విడుదల

తమిళ హీరో విక్రమ్ అస్వస్థతకు గురవడంతో, ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు....

Chiyaan Vikram: హీరో విక్రమ్ హెల్త్ బులెటిన్ విడుదల

Kauvery Hospital Releases Health Bulletin On Chiyaan Vikram

Updated On : July 8, 2022 / 6:03 PM IST

Chiyaan Vikram: తమిళ హీరో విక్రమ్ అస్వస్థతకు గురవడంతో, ఆయన్ను చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారనే వార్తతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే మీడియాలో వస్తున్న పలు వార్తల్లో ఆయనకు గుండెనొప్పి వచ్చిందని, అందుకే ఆయన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారనే అంశంతో అభిమానుల్లో ఆందోళన ఎక్కువయ్యింది. దీంతో వారు తమ అభిమాన హీరో ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అయితే విక్రమ్ కావేరీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం నిజమేనని ఆయన మేనేజర్ సూర్యనారాయణన్ క్లారిటీ ఇచ్చారు.

Chiyaan Vikram: నిలకడగా విక్రమ్ ఆరోగ్యం

చియాన్ విక్రమ్‌కు ఛాతీలో తేలికపాటి అసౌకర్యంగా ఉండటంతో ఆయన్ను కావేరీ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. అయితే ఈలోపే మీడియాలో విక్రమ్‌కు గుండెనొప్పి వచ్చిందని వార్తలు రావడం చూసి తాను షాక్ అయ్యానని.. అందుకే ఇలాంటి వార్తలను నమ్మవద్దంటూ విక్రమ్ అభిమానులకు తెలిపారు. కాగా, తాజాగా కొద్దిక్షణాల ముందే కావేరీ ఆసుపత్రి విక్రమ్ హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేసింది. విక్రమ్‌కు ఛాతిలో నొప్పిరావడంతో ఆయన ఆసుపత్రిలో జాయన్ అయ్యాడని.. నిపుణులైన డాక్టర్లతో ఆయనకు వైద్యం అందించామని.. ఆయనకు ఎలాంటి గుండెపోటు రాలేదని.. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. త్వరలోనే ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.

Chiyaan Vikram: తమిళ్ హీరో విక్రమ్‌కు హార్ట్‌ఎటాక్.. కావేరీ ఆస్పత్రిలో చికిత్స

హీరో విక్రమ్ ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు వార్తలకు ఈ అఫీషియల్ హెల్త్ బులెటిన్‌తో చెక్ పడింది. తమ హీరో త్వరగా కోలుకొని ఇంటికి క్షేమంగా రావాలని విక్రమ్ అభిమానులు కోరుతున్నారు. కాగా, తమిళ ఇండస్ట్రీకి చెందని పలువురు స్టార్స్ విక్రమ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ఏదేమైనా విక్రమ్ ఆరోగ్యంపై ఓ క్లారిటీ రావడంతో ఆయన ఇంటికెప్పుడు వెళ్తారా అని అభిమానలు ఎదురుచూస్తున్నారు.

Kauvery Hospital Releases Health Bulletin On Chiyaan Vikram001