Kiran Abbavaram : సినిమా మీకు అలా అనిపిస్తే ఇక హీరోగా సినిమాలు చేయను.. కిరణ్ అబ్బవరం సంచలన కామెంట్స్..

కిరణ్ అబ్బవరం క సినిమాలో అంత కొత్త పాయింట్ ఏముందో, కిరణ్ అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Kiran Abbavaram : సినిమా మీకు అలా అనిపిస్తే ఇక హీరోగా సినిమాలు చేయను.. కిరణ్ అబ్బవరం సంచలన కామెంట్స్..

Kiran Abbavaram Sensational Comments on HIS Upcoming KA Movie

Updated On : October 28, 2024 / 2:04 PM IST

Kiran Abbavaram : ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగాడు కిరణ్ అబ్బవరం. మొదట్లో కొన్ని మంచి విజయాలే సాధించినా ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ కూడా చూసాడు. అయితే ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ‘క’ సినిమాతో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కిరణ్. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ సినిమాలో చాలా కొత్త పాయింట్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఎక్కడా చూసి ఉండరు అని అన్నారు. అయితే ఇటీవల అందరూ అలాగే చెప్తున్నారు కానీ ఏ రిఫరెన్స్ లేకుండా సినిమా ఉంటుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా కిరణ్.. అసలు ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఓ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. నా పరిధిలో, తెలుగు, ఇండియన్ సినిమాల్లో అయితే ఎక్కడా అలాంటి పాయింట్ గురించి చెప్పలేదు. ఒకవేళ మీకు, ఆడియన్స్ కి అలా అనిపించకపోతే, ఈ పాయింట్ ఏదైనా సినిమాలో చూసాము అని మీకు అనిపిస్తే, ఆ పాయింట్ ఏదైనా సినిమాలో ఉంటే ఇకపై నేను సినిమాలు చేయను అని అన్నారు. దీంతో కిరణ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : Venuswamy : నాగచైతన్య శోభిత విషయంలో.. వేణుస్వామికి తెలంగాణ హైకోర్ట్ షాక్..

అయితే నేడు కిరణ్ మీడియా ప్రతినిధులతో సమావేశం అవ్వగా ఇవాళ కూడా మళ్ళీ ఇదే కామెంట్స్ చేసారు. కిరణ్ మాట్లాడుతూ.. ఇప్పటికి నేను అదే మాట మీద నిలబడుతున్నాను. ఈ సినిమా క్లైమాక్స్ లో కొత్తదనం అనిపించకపోతే, ఓ కొత్త పాయింట్ మేము టచ్ చేసాము అనిపించకపోతే నేను సినిమాలు చేయను అని అన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో ఇలాంటి కామెంట్స్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి కిరణ్ అబ్బవరం క సినిమాలో అంత కొత్త పాయింట్ ఏముందో, కిరణ్ అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.