ఆ రామ్ చరణ్ తెలుసా?.. కేటీఆర్ పంచ్‌కి పగలబడి నవ్వారు..
సినీ హీరో రామ్ చరణ్ తెలుసా అంటూ బాలుణ్ణి ప్రశ్నించిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్..

Ktr Ramcharan
సినీ హీరో రామ్ చరణ్ తెలుసా అంటూ బాలుణ్ణి ప్రశ్నించిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్..
తెలంగాణా ఐటీ మినిస్టర్ KTR ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజాసేవ చెయ్యొచ్చు అనే స్ఫూర్తిని రాజకీయ నాయకులందరిలో రగింలించారు. ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తన స్టైల్లో రిప్లై ఇచ్చిన విషయం మర్చిపోకముందే కేటీఆర్‌కి సంబంధించిన మరో వీడియో.. మీడియా మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుత కరోనా కాలంలో ఆపదలో ఉన్నామని ఎవరైనా ట్వీట్ చేస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతూ.. వారికి తగిన సహాయం చేయడానికి చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగాన్ని వేగవంతం చేస్తూ.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో కరోనాపై స్వయంగా సమీక్షలు జరిపారు కేటీఆర్.
ఇందులో భాగంగా ఓ ఇంటి వద్ద ఆగిన కేటీఆర్.. ‘‘అందరూ మంచిగనే ఉంటారు.. మీకెవ్వరికేం కాదు.. ఎవ్వరూ బయటికి వెళ్లకండి. మూతికి మాస్క్ వేసుకునే బయటికి వెళ్లాలి. మే 3 తారీఖు వరకు.. ఆ తర్వాత ఏమిటనేది అప్పుడు చెబుతాం. పిల్లలు ఇంట్లోనుంచి కదులుతున్నారా? పోనియకండి. నీ కొడుకా..? ఏం పేరు.. అని అడుగగా.. (పిల్లాడు రామ్ చరణ్ అని సమాధానం ఇస్తే..), అవునా.. ఆ రామ్ చరణ్ తెలుసా నీకు? సినిమాల్లో రామ్ చరణ్ తెలుసా..?’’ అని సరదాగా కేటీఆర్ వారితో సంభాషించారు. ఇప్పుడీ వీడియో బాగా వైరల్ అవుతోంది. రామ్ చరణ్ తనకు మంచి మిత్రుడని కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు.
KTR asked a boy you know Ram Charan pic.twitter.com/CsVJZfS1F0
— Y.Chandra Sekhar (@chandra99997) April 16, 2020