‘లాల్ కాప్టాన్’ ఫైనల్ ట్రైలర్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 06:20 AM IST
‘లాల్ కాప్టాన్’ ఫైనల్ ట్రైలర్ రిలీజ్

Updated On : October 2, 2019 / 6:20 AM IST

సైఫ్ అలీ ఖాన్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్రధారులుగా.. ‘NH 10’ ఫేమ్ నవదీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లాల్ కాప్టాన్’.  కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగసాధు ప్రతీకార నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.  

ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకి సంబంధించి చాప్ట‌ర్ 1,2 పేరుతో ప‌లు ట్రైల‌ర్స్ విడుద‌ల చేయ‌గా… తాజాగా మ‌రో ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇందులో స‌న్నివేశాలు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచుతున్నాయి. ఇలాంటి పాత్రలో సైఫ్ నటించడం ఇదే తొలిసారి కాబట్టి ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది.