Lal Salaam Teaser : రజిని బర్త్ డే స్పెషల్.. లాల్ సలామ్ నుంచి సూపర్ యాక్షన్ కట్ టీజర్..

నేడు రజిని బర్త్ డే కావడంతో లాల్ సలామ్ మూవీ టీం ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు.

Lal Salaam Teaser : రజిని బర్త్ డే స్పెషల్.. లాల్ సలామ్ నుంచి సూపర్ యాక్షన్ కట్ టీజర్..

Lal Salaam special action teaser on the occasion of Rajinikanth birthday

Updated On : January 10, 2024 / 7:14 AM IST

Lal Salaam Teaser : సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యా దాదాపు 6 ఏళ్ళ తరువాత మళ్ళీ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకోని చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. తమిళ హీరో విష్ణు విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుంటే రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్‌’గా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అలాగే భారత్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవిత రాజశేఖర్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక నేడు రజిని బర్త్ డే కావడంతో ఒక చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు.

హ్యాపీ బర్త్ డే తలైవా అంటూ రిలీజ్ చేసిన ఈ టీజర్ ని యాక్షన్ పార్ట్ తో కట్ చేశారు. రజిని యాక్షన్ సీన్స్ కి ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. మొత్తం నిమిషం పాటు ఉన్న ఈ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ చూస్తుంటే.. సినిమా హిందు, ముస్లిం గొడవల కథాంశంతో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. ఆ హిందూ ముస్లిం గొడవలకు స్పోర్ట్స్ టచ్ ఇస్తూ ఐశ్వర్యా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణు విశాల్ క్రికెట్ ప్లేయర్ గా కనిపించబోతున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మూవీ టీం సిద్ధం అవుతున్నారు.

Also read : Devil Trailer : కళ్యాణ్ ‘డెవిల్’ ట్రైలర్ రిలీజ్.. బ్రిటిష్ రూలింగ్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్..

ఇక రజిని నటిస్తున్న ‘త‌లైవర్ 170’ అప్డేట్ ని కూడా నేడు బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చారు. ‘జై భీమ్‌’ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘వేటైయాన్’ అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. ‘వేటైయాన్’ అంటే ‘హంటర్’ అనే మీనింగ్ వస్తుందట. టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ అయితే సూపర్ ఉంది. ఇక ఈ సినిమాలో కూడా రజిని పోలీస్ గానే కనిపించబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దసరా విజయన్‌, రక్షన్.. వంటి భారీ తారాగణం కనిపించబోతుంది.