లవకుశ నాగరాజు కన్నుమూత, సంతాపం తెలిపిన చిత్ర పరిశ్రమ

‘లవకుశ’ చిత్రంలో నటించిన నాగరాజు కన్నుమూశారు. నందమూరి తారక రామారావు నటించిన ‘లవకుశ’ చిత్రంలో నాగరాజు లవుడుగా నటించారు. ఇది 1963లో విడుదలై అఖండ విజయం సాధించింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. హైదరాబాద్ లోని గాంధీనగర్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన భక్తరామదాసు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. నాగరాజు అసలు పేరు నాగేందర్‌రావు. సుమారు 300 చిత్రాల్లో నటించారు. కీలుగుర్రం, హరిశ్చంద్ర సినిమాల్లో నటించిన ఏవీ సుబ్బారావు కుమారుడే నాగరాజు.
https://10tv.in/pacer-suspended-after-applying-hand-sanitizer-to-ball/
నందమూరి తారక రామారావు, అంజలీదేవి, కాంతారావు, నాగరాజు, సుబ్రహ్మణ్యం, చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రలలో సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకులుగా తెరకెక్కించిన చిత్రం లవకుశ. 1963లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తీశారు. 1934లో బ్లాక్ అండ్ వైట్ లో లవకుశను దర్శకత్వం వహించిన సి.పుల్లయ్యకే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. 1958లో ప్రారంభమైన ఈ సినిమా పూర్తిగా కలర్ లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.
లవకుశ చిత్రంలో లవుడిగా నాగరాజు నటించగా, కుశుడిగా సుబ్రహ్మణ్యం నటించారు. సీతాదేవిని అడవుల్లో వదిలివేయడంతో ప్రారంభయ్యే ఈ కథలో లవకుశుల జననం, వారు రామాయణ గానం చేయడం, రామ అశ్వమేథయాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి.
ఇందులో లవుడిగా నాగరాజు, కుశుడిగా సుబ్రహ్మణ్యం అద్భుతంగా నటించారు. నాగరాజు మృతికి తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం తెలిపింది.