Guntur Kaaram : మహేష్, త్రివిక్రమ్ సినిమాకి ఇదేమి కొత్త కాదు.. అతడు, ఖలేజా విషయంలో కూడా ఇదే జరిగింది..!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చే సినిమాలకు ఇదేమి కొత్త కాదు. అతడు, ఖలేజా విషయంలో ఏమి జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.

Mahesh Babu Guntur Kaaram follows sentiment of Athadu Khaleja movies
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా వంటి ఫ్యామిలీ యాక్షన్ కామెడీ సినిమాలు ఆడియన్స్ లో మంచి ప్రజాధారణ అందుకున్నాయి. ఇక ఇప్పుడు ‘గుంటూరు కారం’ వంటి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ తో వస్తుండడం, మహేష్ అండ్ త్రివిక్రమ్ ఇద్దరు లాస్ట్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యి ఉండడంతో ఈ మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
Salaar : బాలీవుడ్‌లో సలార్ కష్టమేనా? అసలు బాలీవుడ్‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తారా?
అయితే ఈ మూవీ చిత్రీకరణ విషయం మాత్రం ప్రేక్షకులకు మూవీ పై ఇంటరెస్ట్ పోయేలా చేస్తుంది. 2022 లో మొదలైన ఈ సినిమా కనీసం 50 శాతం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకోలేదు. అంతేకాకుండా హీరోయిన్ పూజా హెగ్డే, సినిమాటోగ్రాఫర్ పి ఎస్ వినోద్.. ఇలా చిత్ర యూనిట్ నుంచి ఒక్కొక్కరిగా బయటకి వెళ్లిపోతుండడంతో అసలు మూవీ ఉందా? లేదా? అన్న ఒక సందేహం మొదలైంది. అయితే మహేష్ అండ్ త్రివిక్రమ్ సినిమాలకి ఇదేమి కొత్త కాదు. గత చిత్రాలు అతడు, ఖలేజా విషయంలో కూడా ఇదే జరిగింది.
Kanguva : ‘కంగువ’లో రెండు కథలు.. గ్లింప్స్‌లో చూసింది ఫ్లాష్ బ్యాక్ మాత్రమే..
అతడు సినిమా షూటింగ్ దాదాపు 2 ఏళ్ళ పాటు జరిగింది. ఇక ఖలేజా విషయానికి వస్తే మరో ఏడాది పెరిగి ఏకంగా 3 ఏళ్ళ పాటు చిత్రీకరణ జరుపుకుంది. ఈ రెండు చిత్రాలు ఏవేవో కారణాలు వల్ల షెడ్యూల్స్ సక్రమంగా జరగక షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం విషయంలో కూడా అదే జరుగుతుంది. 2021 మేలో అనౌన్స్ చేసిన ఈ మూవీ.. 2022 సెప్టెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలయ్యి మొదటి షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేసుకుంది. ఇక రెండో షెడ్యూల్ ని నుంచి మొదలయ్యాయి బ్రేక్లు.
కాగా ఇప్పుడు ఈ సినిమాలో పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), డీఓపీ పి ఎస్ వినోద్ స్థానంలో రవి కే చంద్రన్ వచ్చి చేరారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా చేంజ్ అయ్యాడని వార్తలు వస్తునప్పటికీ వాటిలో వాస్తవం లేదని సమాచారం. మరి చూడాలి ఈ సినిమా ఎన్నాళ్ల పాటు షూటింగ్ జరుపుకుంటుందో.