Mokshagna Entry: మోక్షజ్ఞ ఆరంగేట్రంపై బాలయ్య క్లారిటీ.. బిగ్ అనౌన్స్‌మెంట్!

Mokshagna Entry: మోక్షజ్ఞ ఆరంగేట్రంపై బాలయ్య క్లారిటీ.. బిగ్ అనౌన్స్‌మెంట్!

Balayya Birthday Surprise Announcement

Updated On : April 30, 2025 / 10:47 AM IST

Balayya Birthday Surprise Announcement: అభిమానుల ఆశలకు అనుగుణంగా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు నందమూరి హీరో, నటసింహ బాలకృష్ణ. నందమూరి వంశంలో మరో యాక్టర్ సినీరంగంలోకి ఆరంగ్రేటం చేసేందుకు ముహుర్తం ఫిక్స్ అయినట్లుగా ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ.. మోక్షజ్ఞ ఎంట్రీ అతి చేరువలోనే ఉందని వెల్లడించారు.

తాను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా మోక్షజ్ఞ సినిమా రానుందని బాలయ్య చెప్పారు. అంతేకాదు ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మైత్రీ మూవీస్‌లో బాలయ్య ఓ సినిమా చేస్తుండగా.. ఈ నిర్మాణ సంస్థలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండనున్నట్లుగా చెబుతున్నారు.

తన తండ్రి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన తాతమ్మకల సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో.. తాను కూడా తన కొడుకు ఫస్ట్ మూవీకి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మోక్షజ్ఞకు మెళుకువలు నేర్పిస్తానని బాలకృష్ణ తెలిపారు.

వాస్తవానికి బాలయ్య అభిమానులు, నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా ఉప్పెన దర్శకుడితో సినిమా ఉంటుంది అని వార్తలు రాగా.. ఇప్పుడు బాలయ్య క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆనందపడుతున్నారు.