వంద కోట్లకి పైగా వసూళ్లు సాధించిన ‘యురి’

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 04:44 AM IST
వంద కోట్లకి పైగా వసూళ్లు సాధించిన ‘యురి’

Updated On : April 8, 2019 / 4:44 AM IST

బాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2019 స్టార్టింగ్ అదిరిపోయింది. వరుస హిట్టు సినిమాలతో హిందీ హీరోలంతా ఈ ఏడాది ఆడియన్స్ ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. మూడు నెలల్లో ఓ బ్లాక్ బస్టర్ నాలుగు సూపర్ హిట్లు రెండు హిట్టు సినిమాలతో బాలివుడ్ బాక్స్ బద్దలు కొట్టేసింది. జనవరి 11న రిలీజైన ‘యురి’ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో తెరకెక్కిన యురి సినిమా 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 245 కోట్లకిపైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు హిందీలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సంవత్సరం మొదటి నుంచే బాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రయోగాలకి పెద్దపీట వేశారు. మూడు నెలల్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కామెడీ ఎంటర్టైనర్ టోటల్ ధమాల్, మ్యూజికల్ డ్రామా గల్లీబాయ్, వెరైటీ లవ్ స్టోరీ లుక్కా చుప్పి, థ్రిల్లర్ మూవీ బద్లా ఈ నాలుగు సినిమాలకు ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ రావడమే కాక.. వంద కోట్లకి పైగా వసూళ్లు సాధించాయి.

అంతేకాదు ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి జనవరి 25న రిలీజైన మణికర్ణిక సినిమా కూడా హిట్ అయ్యింది. కంగనా రనౌత్ పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మణికర్ణిక వంద కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. మార్చిలో రిలీజైన కేసరి సినిమా కూడా వంద కోట్లు వసూల్ చేసి హిట్టు సినిమాగా నిలిచింది. ఇలా మూడు నెలల్లో ఆరు హిందీ సినిమాలు వంద కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టాయి.