OTT Release Films: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. యంగ్ హీరో సంతోశ్ శోభన్ మంచి రోజులు వచ్చాయి అంటూ ఆహాకి రాబోతున్నాడు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై అభిషేక్ బచ్చన్ నెవర్ బిఫోర్..

OTT Release Films: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో సినిమాలివే!

Ott Release Films (1)

Updated On : November 30, 2021 / 1:32 PM IST

OTT Release Films: ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. యంగ్ హీరో సంతోశ్ శోభన్ మంచి రోజులు వచ్చాయి అంటూ ఆహాకి రాబోతున్నాడు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై అభిషేక్ బచ్చన్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో మెస్మరైజ్ చేస్తానంటున్నాడు.. వీళ్లతో పాటూ ఇంకా ఎవరెవరు ఏ ఏ సినిమాలతో ఇండియన్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం.

Pakka Commercial: ఏంజెల్ రాశిఖన్నా.. మేకర్స్ స్పెషల్ విషెష్!

ఆహాలో డిసెంబర్ 3న స్ట్రీమిండ్ డేట్ ఫిక్స్ చేసుకుంది మంచి రోజులు వచ్చాయి. సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా అతితక్కువ రోజుల్లో తెరకెక్కించాడు డైరెక్టర్ మారుతి. థియేటర్స్ లో రిలీజై పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు ఆహా లోకి వచ్చేస్తోంది. కొవిడ్ పాండెమిక్ లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ మూవీగా మంచి రోజులు వచ్చాయి రూపొందింది.

Telugu Film Releases: టార్గెట్ డిసెంబర్.. ఈ వారం సినిమాలివే!

2006లో రిలీజై సూపర్ అప్లాస్ దక్కించుకున్న కోబాల్ట్ బ్లూ నోవెల్ ఆధారంగా అదే పేరుతో డిసెంబర్ 3న నెట్ ఫ్లిక్స్ కి రాబోతుంది కోబాల్డ్ బ్లూ ఫిల్మ్. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే వ్యక్తిని ప్రేమించడం… ఆ తర్వాత ఫ్యామిలీలో చోటుచేసుకునే ఇన్సిడెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సచిన్ కుందాల్కర్. యంగ్ లవ్, హోమోసెక్సువాలిటీ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి వాటిని చాలా సెన్సెటివ్ గా చూపించబోతున్నారని అంటున్నారు.

Divi Vadthya: దివి వాధ్యా.. అందం అదరహో!

2012లో రిలీజైన కహాని మూవీలోని బాబ్ బిశ్వాస్ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని రాబోతున్న సినిమా బాబ్ బిశవాస్. అభిషేక్ బచ్చన్ టైటిల్ రోల్ చేసాడు. చిత్రంగదా దాస్ ఆయన భార్యగా నటించింది. తన కెరీర్ లో ఓ సూపర్ క్యారెక్టర్ గా మిగులుతుందన్న నమ్మకంతో ఉన్నాడు అభిషేక్. ఈ మూవీ జీ5 లో డిసెంబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

Telugu Star Hero’s: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే

డిసెంబర్ 3న మనీ హీస్ట్ సీజన్ 5 వ్యాల్యూమ్ 2 రాబోతుంది. అదే రోజు ఇన్ సైడ్ ఎడ్జ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కి రెడీఅయింది. మనీ హీస్ట్ నెట్ ఫ్లిక్స్ లో… ఇన్ సైడ్ ఎడ్జ్ ప్రైమ్ లో సందడి చేస్తాయి. మనీ హీస్ట్ పై ఫుల్ హోప్స్ అండ్ గ్యారంటీ హిట్ టాక్ ఉన్నా.. ఇన్ సైడ్ ఎడ్జ్ కూడా తక్కువేమి కాదు. ఇంతకు ముందు సీజన్స్ ప్రేక్షకులకు బాగానే కనెక్టయింది.

Anchor Shyamala: కొత్త ఇల్లు చూపించిన యాంకర్.. బాబోయ్ ఇంద్రభవనమే!

ఈ సినిమాలతో పాటూ ముబి యాప్ లో ఫ్రెంచ్ డ్రామా అజోర్.. మూవీ సెయింట్స్ లో తమిళ్ థ్రిల్లర్ కయమయి కడక్క రిలీజ్ కాబోతున్నాయి. ఇక జీ5లో సాయి పల్లవి సిస్టర్ లీడ్ రోల్ చేసిన చిత్తిరయి సెవ్వనమ్ కూడా ఈ వారమే ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. డిసెంబర్ 1న నెట్ ఫ్లిక్స్ లో లాస్ట్ ఇన్ స్పేస్ సీజన్3 స్ట్రీమింగ్ కాబోతుండగా.. అదే రోజు బుక్ మై షో యాప్ తో పాటూ ముబి యాప్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 రాబోతుంది. ఆల్రెడీ థియేటర్స్ లో రిలీజై హిట్ కొట్టిన ఎఫ్9 ఇంగ్లీష్ తో పాటూ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీఅయింది.