Nani – Samantha : ఎయిర్ పోర్ట్‌లో నానితో సమంత.. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు..?
నాని, సమంత కలిసి గతంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ ఇలా కలిశారు.

Nani and Samantha Meet in Airport Videos Goes Viral
Nani – Samantha : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 30న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. దీంతో నాని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని ముంబైకి వెళ్తూ హీరోయిన్ సమంత ని కలిసాడు.
Also Read : Indra Re Release : ‘ఇంద్ర’ రీ రిలీజ్.. థియేటర్స్‌లో అంకుల్స్ హంగామా.. రచ్చ చేస్తున్న సీనియర్స్ ఫ్యాన్స్..
నాని ముంబై వెళ్తూ సమంతని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసాడు. సమంత కూడా నాని వెళ్తున్న ఫ్లైట్ కే ముంబైకి వెళ్తుండటంతో ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి ఫ్లైట్ వద్దకు వెళ్లారు. నాని, సమంత కలిసి నడుస్తున్న వీడియో, బస్ లో ఫ్లైట్ వద్దకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక సమంత కూడా ప్రస్తుతం బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడంతో ముంబైకి, ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది.
#Nani with #Samantha while travelling to Mumbai#SaripodaSanivaaram #SamanthaRuthPrabhu #Nani #LatestNews #filmifytelugu @NameisNani @Samanthaprabhu2 pic.twitter.com/HZCdy57aEY
— Filmify Official (@FilmifyTelugu) August 22, 2024
నాని, సమంత కలిసి గతంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈ ఇద్దరూ ఇలా కలిసి సరదాగా మాట్లాడుకోవడం, ఆ వీడియోలు వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#Nani, on his way to Mumbai for #SaripodhaaSanivaaram promotions, met #SamanthaRuthPrabhu at Hyderabad Airport. pic.twitter.com/cFamMgmer4
— Gulte (@GulteOfficial) August 22, 2024