కొడుకు కంటే చిన్నదాన్ని ఐదో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటుడు..

పాపులర్ హాలీవుడ్ యాక్టర్ నికోలస్ కేజ్ ఐదవసారి పెళ్లి చేసుకున్నారు. లాస్ వెగాస్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ప్రేయసి రికో షిబాతాను పెళ్లాడారు కేజ్..

కొడుకు కంటే చిన్నదాన్ని ఐదో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటుడు..

Updated On : March 6, 2021 / 4:20 PM IST

Nicolas Cage Fifth Marriage: పాపులర్ హాలీవుడ్ యాక్టర్ నికోలస్ కేజ్ ఐదవసారి పెళ్లి చేసుకున్నారు. లాస్ వెగాస్‌లోని ఓ స్టార్ హోటల్‌లో ప్రేయసి రికో షిబాతాను పెళ్లాడారు కేజ్.. ఆయన వయసు 57 ఏళ్లు కాగా ఆమె ఏజ్ 26 సంవత్సరాలు.. ఇద్దరిమధ్య 31 సంవత్సరాల వ్యత్యాసం ఉంది.

Nicolas Cage

ఆరు నెలల పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత నికోలస్, రికో షిబాతా మ్యారేజ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నికోలస్ గతంలో నలుగురిని వివాహం చేసుకున్నారు. 2019లో ఎరికాను నాలుగో పెళ్లి చేసుకున్న కేజ్ అదే ఏడాది ఆమెకు విడాకులిచ్చారు.

Nicolas Cage

కాగా నికోలస్‌కు 30 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతని కన్నా నికోలస్ ఐదవ భార్య నాలుగేళ్లు చిన్నది కావడం విశేషం. వీరి వివాహం గురించి తెలుసుకున్న పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నికోలస్ ఐదో పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Nicolas Cage