Krithi Shetty-Sreeleela: సౌత్‌ని ఏలుతున్న పూజా, రష్మిక.. ఈ ఇద్దరూ రీప్లేస్ చేస్తారా?

హీరోలు ఎంత కాలం లైమ్ లైట్లో ఉన్నా హీరోయిన్లకు మాత్రం ఆచాన్స్ చాలా తక్కువ. ఇప్పటి జనరేషన్ అయితే ఎప్పటి కప్పుడు స్క్రీన్ ఫ్రెష్ గా ఉండాలని కొత్త కాంబినేషన్స్ ఎక్స్ పెక్ట్..

Krithi Shetty-Sreeleela: సౌత్‌ని ఏలుతున్న పూజా, రష్మిక.. ఈ ఇద్దరూ రీప్లేస్ చేస్తారా?

Krithi Shetty Sreeleela

Updated On : April 7, 2022 / 9:31 PM IST

Krithi Shetty-Sreeleela: హీరోలు ఎంత కాలం లైమ్ లైట్లో ఉన్నా హీరోయిన్లకు మాత్రం ఆచాన్స్ చాలా తక్కువ. ఇప్పటి జనరేషన్ అయితే ఎప్పటి కప్పుడు స్క్రీన్ ఫ్రెష్ గా ఉండాలని కొత్త కాంబినేషన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫాన్స్. సమంత, కాజల్, తమన్నా నుంచి పూజా హెగ్డే, రష్మిక, కియారాకి ట్రాన్స్ ఫర్ అయిన ఈ క్రేజ్ ఇప్పుడు మరో ఇద్దరు ముద్దుగుమ్మల దగ్గర ఆగింది. మరి పూజా, రష్మికని రీప్లేస్ చెయ్యబోతున్న ఆ ఇద్దరు హీరోయిన్లెవరో చూద్దాం.

Krithi Shetty: చిలకపచ్చ చీరలో కుర్ర గుండెల్ని కొల్లగొడుతున్న బేబమ్మ!

టాలీవుడ్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడానికి ఎప్పుడూ సరికొత్త సనిమాలతో పాటు సరికొత్త హీరోయిన్లను కూడా తెరమీదకి తెస్తుంటారు. అలా.. హీరోయిన్లు ఈ మధ్య ఎంత మంది వచ్చినా.. వాళ్లలో మాత్రం కృతి శెట్టి, శ్రీలీల.. ఈ ఇద్దరు మాత్రమే వరసగా అవకాశాలు దక్కించుకంటున్నారు. అంతేకాదు.. ప్రజెంట్ సౌత్ ని ఏలుతున్న పూజాహెగ్డే, రష్మికని రీప్లేస్ చేసేలా కనిపిస్తున్నారు. సీనియర్ హీరోయిన్లు సైడైపోయాక.. పూజాహెగ్డే, రష్మిక, కియారా లాంటి హీరోయిన్లు బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

Krithi Shetty: సూర్య పక్కన ఫిక్స్ అయిన బేబమ్మ!

అయితే ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాల్ని తన్నుకుపోయేలా ఉన్నారు కృతి శెట్టి, శ్రీలీల. వరస పెట్టి సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్లకు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు మేకర్స్ కూడా కృతి శెట్టి, శ్రీలీల మీదే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే.. అప్ కమింగ్ హీరోయిన్లు కాబట్టి డేట్స్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. లుక్ వైజ్ కూడా ఫ్రెష్ నెస్ ఉంటుంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉందని ఈ ఇద్దరికీ ఫిక్స్ అయిపోతున్నారు మేకర్స్. పూజా, రష్మిక ప్రజెంట్ ఇటు సౌత్ తో పాటు నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నారు కాబట్టి.. ఈ ఇద్దరి సినిమాల ఛాన్స్ కొట్టేస్తున్నారు కృతి శెట్టి, శ్రీలీల.

Krithi Shetty: మూడు సినిమాలతోనే పాన్ ఇండియా స్టార్‌గా కృతి శెట్టి..?

కృతి శెట్టి, శ్రీలీలలో కృతి శెట్టి ఒక మెట్టు పైనే ఉంది. రష్మకి, పూజా లాంటి స్టార్ హీరోయిన్లకు రెమ్యూనరేషన్ ఎంత లేదన్నా 3, 4 కోట్లు ముట్టచెప్పాలి. అదీ కాక వీళ్లిద్దరూ అటు బాలీవుడ్ సినిమాలతో కూడా ఫుల్ బిజీగా ఉంటున్నారు. అదే కృతి శెట్టి, శ్రీలీల అయితే కోట్లకు కోట్లు స్పెండ్ చెయ్యాల్సిన అవసరం లేదు. అది కాక వీళ్లిద్దరికీ ఇంకా బాలీవుడ్ పై కన్ను పడలేదు కాబట్టి.. సౌత్ లో సినిమాలు చేయించడం ఈజీ అంటున్నారు మేకర్స్. అంతేకాదు.. కాల్ షీట్స్ విషయంలో కూడా కాస్త అటూ ఇటైనా పెద్ద ప్రాబ్లమ్ ఉండదని, సినిమా ప్రమోషన్లకు కూడా బాగా హెల్ప్ అవుతారంటూ ఈ ఇద్దరు హీరోయిన్లే బెస్ట్ ఆప్షన్ అని ఫీలవుతున్నారు మేకర్స్. స్పెషల్లీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యిన కృతి విషయంలో ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

Krithi Shetty : లిప్‌లాక్, బోల్డ్ సీన్స్ అన్నీ మామూలు సీన్స్ లాంటివే : కృతిశెట్టి

ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి శెట్టి వరస సినిమాలతో బిజీగా ఉంది. ఉప్పెన తర్వాత నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు, సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు.. రామ్-లింగుస్వామి కాంబినేషన్లో వస్తున్న వారియర్ మూవీలో కూడా నటిస్తోంది.

Sreeleela: బాగా పెంచేసిన కన్నడ బ్యూటీ.. సినిమాకి కోటి డిమాండ్?

ఈ సినిమాలతో పాటు నితిన్ చేస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ మాచర్ల నియోజకవర్గంలో కూడా హీరోయిన్ గా కృతి శెట్టే చేస్తోంది. ఇవన్నీ చిన్న చిన్న హీరోలవైతే.. ఇప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ ఛాన్స్ దక్కించుకుంది ఉప్పెన భామ. ఏకంగా సూర్యతో బాల డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించే చాన్స్ దక్కించుకుంది కృతి శెట్టి.

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. కన్నడ బ్యూటీకి మరో జాక్‌పాట్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ మూవీ అయిన పెళ్లి సందడి సినిమా టైటిల్ తో రిలీజ్ అయిన పెళ్లిసందడి సినిమాలో హీరోయిన్ హాట్ టాపిక్ అయ్యింది. బ్యూటి ఫుల్ లుక్స్ తో పాటు అదిరిరిపోయే గ్రేస్ తో అందరినీ ఆకట్టుకున్న హీరోయిన్ శ్రీలీల.. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరి హీరోలతో నటిస్తోంది.

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

క్యూట్ గా అందంగా అంతే ఎనర్జిటిక్ గా ఉండే శ్రీలీల రవితేజతో ధమాకా సినిమాలో నటిస్తోంది. అంతేకాదు నవీన్ పోలిశెట్టి హీరోగా చేస్తున్న అనగనగా ఒక రోజు సినమా కూడా సైన్ చేసింది. వీటితో పాటు రౌడీ బాయ్స్ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఆశిష్ కి హీరోయిన్ గా డేట్స్ తీసుకున్నారు దిల్ రాజు. అంతేకాదు వైష్ణవ్ తేజ్ తో కూడా సినిమా చేస్తోంది ఈ పెళ్లి సందడి హీరోయిన్. ఇలా కృతి, శ్రీలీల పూజా, రష్మిక ప్లేస్ ని రీప్లేస్ చేసే పనిలో.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.