Pooja Hegde : గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే అవుట్.. కారణం అదేనట!
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే బయటకి వెళ్లిపోయిందట. అయితే ఆమె బయటకి వెళ్ళిపోడానికి కారణం..

Pooja Hegde is out from Mahesh Babu Guntur Kaaram movie
Pooja Hegde – Guntur Kaaram : మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కలయికలో తెరెకెక్కుతున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గుంటూరు కారం. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే, శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకున్న దగ్గర నుంచి ఏదొక ఇబ్బందులు వచ్చి చిత్రీకరణ లేటు అవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా పై రోజుకో వార్త నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంటాయి. తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే బయటకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి ఈ వార్త మాత్రం రూమర్ కాదు నిజమే అంటున్నాయి ఫిలిం వర్గాలు. ఈ మూవీకి పూజా ఇచ్చిన కాల్ షీట్లు ఇప్పటికే పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది. అయితే షూటింగ్ ఇంకా 50 శాతం పైగా బ్యాలన్స్ ఉండడంతో పూజా మరికొన్ని నెలలు పాటు ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ పూజా డేట్స్ ఇతర సినిమాలతో లాక్ అయ్యిపోయి ఉన్నాయి. దీంతో గుంటూరు కారం చిత్రానికి కుదరడం లేదు. ఇందువల్లనే పూజానే స్వయంగా తప్పుకున్నట్లు తెలుస్తుంది. కాగా పూజాతో ఆల్రెడీ కొన్ని సీన్స్ కూడా చిత్రీకరణ చేశారు.
Chiranjeevi : మెగా వారసురాలికి ఎవరి పోలికలు వచ్చాయి.. మెగాస్టార్ ఏమి చెప్పారు..
ఇప్పుడు పూజా హెగ్డే ప్లేస్ లో వచ్చే హీరోయిన్ తో మళ్ళీ ఆ సీన్స్ అన్ని రీ షూట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ఏ హీరోయిన్ రాబోతుందో? అని అందరిలో ఆసక్తి నెలకుంది. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. థమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు, అలాగే సినిమా కథలో కూడా మార్పులు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉన్నదో అనేది తెలియదు.