S Thaman : బ్రో, గుంటూరు కారం మేకర్స్‌కి మ్యూజిక్ కష్టాలు అంటూ ఆర్టికల్స్.. మజ్జిగ స్టాల్‌ ఓపెన్ అంటున్న థమన్!

పవన్ బ్రో, మహేష్ గుంటూరు కారం చిత్రాలకు థమన్ మ్యూజిక్ వల్ల కష్టాలు అంటూ కొన్ని రోజులుగా ఆర్టికల్స్ వస్తుండడంతో థమన్ వాళ్లందరికీ మజ్జిగ స్టాల్‌ను ఓపెన్ చేస్తున్నాడు.

S Thaman : బ్రో, గుంటూరు కారం మేకర్స్‌కి మ్యూజిక్ కష్టాలు అంటూ ఆర్టికల్స్.. మజ్జిగ స్టాల్‌ ఓపెన్ అంటున్న థమన్!

S Thaman counter tweets on Bro and Guntur Karam movie fake articles

Updated On : June 20, 2023 / 11:51 AM IST

Bro – Guntur Karam : టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ బ్రో అండ్ గుంటూరు కారం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో మెగా మల్టీస్టారర్ చిత్రంగా బ్రో తెరకెక్కుతుంటే.. త్రివిక్రమ్, మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో గుంటూరు కారం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ రెండు సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ మోషన్ పోస్టర్ గ్లింప్స్ కి థమన్ ఇచ్చిన సంగీతం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది.

Ram Charan : మెగా వారసురాలు గురించి సెలబ్రిటీస్ ట్వీట్స్.. చిరంజీవి, ఎన్టీఆర్ ఏమి ట్వీట్ చేశారో తెలుసా?

అయితే బ్రో చిత్రం రిలీజ్ దగ్గర పడుతున్నా థమన్ తన వర్క్ ఇంకా పూర్తి చేయలేదని, అలాగే గుంటూరు కారం చిత్రానికి థమన్ ఇచ్చిన సంగీతం మేకర్స్ కి నచ్చడం లేదని.. ఇలా రకరకాల వార్తలు పలు వెబ్ సైట్ మీడియాలు కొన్ని రోజులుగా రాసుకొస్తున్నాయి. ఇక వీటిపై థమన్ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో వరుస ట్వీట్స్ వేసి ఆ వార్తల్లో నిజం లేదని తెలియజేసాడు. “కడుపు మంటకి అరటిపండు మంచిది తినండి. లేకపోతే నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్‌ను ఓపెన్ చేస్తున్నా వచ్చి తాగండి. కడుపు మంటకి మజ్జిగ చాలా మంచిది” అంటూ ట్వీట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన

కాగా థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నిటికి సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అయిన పవన్ కళ్యాణ్ OG అండ్ రామ్ చరణ్ – గేమ్ చెంజర్, రామ్ పోతినేని – బోయపాటి చిత్రాలతో పాటు బాలకృష్ణ – భగవంత్ కేసరి సినిమాకి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సిట్టింగ్స్ లో థమన్ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.