Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ నుంచి పూనకాలు లోడింగ్ చేస్తున్న బాస్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో క్రియేట్ చేశాయి.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ నుంచి పూనకాలు లోడింగ్ చేస్తున్న బాస్!

Poonakalu Song From Waltair Veerayya To Be Launched Soon

Updated On : December 28, 2022 / 6:49 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, చిరంజీవి చాలా రోజుల తరువాత ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో క్రియేట్ చేశాయి.

Waltair Veerayya: ఈ సినిమా రొటీన్ ఎంటర్‌టైనర్.. హెడ్డింగ్ రాసిపెట్టుకోమంటున్న వీరయ్య!

అయితే ఈ సినిమాలోని అసలుసిసలైన పూనకాలు తెప్పించే పాటను రెడీ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలోని ‘పూనకాలు’ అనే సాంగ్‌ను లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ పాటను ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారనే అప్డేట్‌కు సంబంధించి చిత్ర వర్గాల్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినీ వర్గాల్లో దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పూనకాలు సాంగ్ డేట్ అండ్ టైమ్ కూడా వినిపిస్తోంది. ఈ పూనకాలు సాంగ్‌ను డిసెంబర్ 30న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో సాయంత్రం 6 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Waltair Veerayya: టైటిల్ సాంగ్‌తో దిగుతున్న వీరయ్య.. పూనకాలతో ఫ్యాన్స్ రెచ్చిపోడం ఖాయం!

వాల్తేరు వీరయ్య సినిమాకే ఇది బెస్ట్ మాస్ సాంగ్ అని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, చిత్ర దర్శకుడు బాబీ చెప్పుకొస్తున్నారు. మరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఈ ‘పూనకాలు’ సాంగ్ ఎలా ఉండబోతుందో.. ఈ పాటను ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారో చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మాస్ రాజా రవితేజ ఓ కీల పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.