Sandeep Reddy Vanga : అప్పుడు ఆర్జీవీ.. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా.. రాజమౌళి గ్రేట్ కామెంట్స్..
యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి వంగా గురించి రాజమౌళి గొప్పగా మాట్లాడారు.

Rajamouli great comments about Animal movie director Sandeep Reddy Vanga
Sandeep Reddy Vanga : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వారు ఉన్నారు. అయితే వారిలో కొందరు మాత్రం తెలుగు సినిమా నేషనల్ లెవెల్ లో వినబడేలా చేసిన వారు ఉన్నారు. అలంటి వారిలో కె విశ్వనాథ్, బాపు, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి.. ఇలా చాలా తక్కువ పేరులే ఉన్నాయి. కానీ ఇండియన్ సినిమాలో వీరు వేసిన మార్క్ మాత్రం ఒక టర్నింగ్ పాయింట్ అవుతూ వచ్చింది. వీరి కోవకి చెందిన వారే కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డితో ఇండియన్ సినిమాని షాక్ చేశారు.
అదే సినిమాని బాలీవుడ్ కూడా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్.. ఇప్పుడు రణబీర్ తో యానిమల్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు.
ఇక ఈ ఈవెంట్ లో జక్కన్న మాట్లాడుతూ.. “ప్రతి సంవత్సరం కొత్త డైరెక్టర్స్ వచ్చి సూపర్ హిట్స్ కొట్టడం మనం చూస్తూనే ఉంటాము. కానీ ఎప్పుడో ఒకసారి ఒక డైరెక్టర్ వస్తాడు. అతను ఆడియన్స్, ఇండస్ట్రీని మాత్రమే కాదు. సినిమా అంతే ఇలానే చేయాలి అనే పద్ధతిని కూడా షేక్ చేస్తాడు. అలాంటి డైరెక్టర్ సందీప్ వంగా. మా తరంలో రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు సందీప్ వంగా. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వాంగా ఉంది సందీప్” అంటూ గొప్పగా మాట్లాడారు.
Also read : Anil Kapoor : నన్ను హీరో చేసింది తెలుగువారే.. బాపుగారు లేకపోతే నేను లేను.. అనిల్ కపూర్ కామెంట్స్
కాగా ఈ యానిమల్ మూవీ కథ విషయంలో రామ్ గోపాల్ వర్మ కూడా సహాయం చేశారని సందీప్ గతంలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని అండర్ వరల్డ్ డాన్ బ్యాక్‌డ్రాప్, యాక్షన్ పార్ట్ రాయడం కోసం సందీప్, ఆర్జీవీ హెల్ప్ తీసుకున్నారు. మరి ఆర్జీవీ ఐడియాలజీకి సందీప్ వంగా టేకింగ్ తో ఆ సీన్స్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా కనిపించబోతున్నాయో చూడాలి. యానిమల్ మూవీ డిసెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.