Game Changer : యాక్షన్ సీక్వెన్స్‌తో గేమ్ చెంజర్ కొత్త షెడ్యూల్ స్టార్ట్.. ఆగష్టులో సర్‌ప్రైజ్..!
రామ్ చరణ్, శంకర్ గేమ్ చెంజర్ సినిమా యాక్షన్ షెడ్యూల్ తో మళ్ళీ పట్టాలు ఎక్కింది. ఇది ఇలా ఉంటే, ఆగష్టులో అభిమానుల కోసం మేకర్స్ ఒక సర్‌ప్రైజ్..

Ram Charan Game Changer shooting resumes and teaser could be released in august
Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) జంటగా మరోసారి కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘గేమ్ చెంజర్’. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల మెగా వారసురాలు రాకతో ఈ మూవీ షూటింగ్ కొంచెం గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు తిరిగి షూటింగ్ సెట్ లోకి అడుగు పెట్టాడు. ఇక రావడం రావడంతోనే యాక్షన్ షెడ్యూల్ తో దుమ్ము లేపనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.
Vijay : 11 ఏళ్ళ తరువాత మరోసారి శంకర్ దర్శకత్వంలో విజయ్.. ఈసారి రీమేక్..? ఒరిజినల్..?
గేమ్ షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యిందని, యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నామని తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం మేకర్స్ ఆగష్టులో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఆగష్టు 15న ఈ మూవీ నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ప్రస్తుతం నెట్టింట ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది.
Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్‌లో..
Jumping right into a riveting fight sequence. Back in action, truly! #Gamechanger pic.twitter.com/HKpjXeNfbH
— Shankar Shanmugham (@shankarshanmugh) July 11, 2023
కాగా ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో 50వ చిత్రంగా తెరకెక్కుతుండడంతో ఎక్కడ రాజీ పడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే.. ఈ మూవీకి మరో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తున్నాడు. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.