Ram Charan – Ranveer Singh : రామ్ చరణ్ అండ్ రణవీర్ న్యూ సస్పెన్స్ థ్రిల్లర్.. టీజర్ అదుర్స్..

రామ్ చరణ్, రణవీర్ సింగ్, త్రిష, దీపికా పదుకొనె కలిసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించారా? తన సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసిన రణవీర్.

Ram Charan – Ranveer Singh : రామ్ చరణ్ అండ్ రణవీర్ న్యూ సస్పెన్స్ థ్రిల్లర్.. టీజర్ అదుర్స్..

Ram Charan Ranveer Singh Deepika Padukone Trisha Krishnan new project

Updated On : July 2, 2023 / 4:28 PM IST

Ram Charan – Ranveer Singh : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రామ్ చరణ్ అండ్ రణవీర్ సింగ్ ఇద్దరు బడా స్టార్స్. వారిద్దరూ కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే అభిమానులకు పండగా. ఆమధ్య రామ్ చరణ్ – గేమ్ చెంజర్ (Game Changer) మూవీ ఓపెనింగ్ కి రణవీర్ గెస్ట్ గా రాగా.. ఇద్దరు కలిసి ఫోజులిచ్చిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్నారా? అని ప్రశ్న మొదలైంది. ఈ ఆదివారం (జూన్ 2) రణవీర్ తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు.

Salaar : రెబల్స్ గెట్ రెడీ.. సలార్ టీజర్ ఆ రోజునే..

ఆ వీడియోలో దీపికా పదుకొనె ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తూ కనిపిస్తుంది. ఆ తరువాత సీన్ లో రణవీర్.. సార్ టార్గెట్ కనిపించింది అని చెబుతాడు. ఆ నెక్స్ట్ సీన్ లో ఒక ఆఫీసర్ రామ్ చరణ్ తో.. ఏజెంట్ గో గో అంటుండగా చరణ్ పరిగెత్తడం చూపించారు. చివరిగా పోలీస్ స్టేషన్ లో త్రిషని కూడా చూపించారు. ఈ పోస్ట్ కి రణవీర్.. ‘సీక్రెట్ ని బయట పెడదాం’ అంటూ కాప్షన్ రాసుకొచ్చాడు. అలాగే త్వరలో రాబోతుందని కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అసలు ఇది ఎప్పుడు షూట్ చేశారని ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

అలాగే అసలు ఇది మూవీనా? వెబ్ సిరీస్? లేక ప్రమోషనల్ యాడ్? తెలియక ప్రేక్షకులంతా నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఇలాగే ఒక యాడ్ కోసం రామ్ చరణ్, రణవీర్, కార్తీ నటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఇది దేని కోసం అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.