సెట్ కాలిపోయింది : చివరి షెడ్యూల్ కంప్లీట్ చేస్తాం

సైరా సెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి స్పందించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..

  • Published By: sekhar ,Published On : May 3, 2019 / 11:27 AM IST
సెట్ కాలిపోయింది : చివరి షెడ్యూల్ కంప్లీట్ చేస్తాం

Updated On : May 3, 2019 / 11:27 AM IST

సైరా సెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం గురించి స్పందించిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న సినిమా, సైరా నరసింహారెడ్డి.. చిరంజీవి సొంత ఫామ్ హౌస్‌లో సైరా కోసం ఒక భారీ సెట్ వేసారు. గురువారం రాత్రి వరకు ఇక్కడే షూటింగ్ జరిగింది. శుక్రవారం తెల్లవారు ఝామున షార్ట్ సర్క్యూట్ వల్ల సెట్ కాలిపోయింది.

ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. దురదృష్టవశాత్తు సైరా సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కోకాపేట్‌లో వేసిన సెట్ దాదాపుగా కాలిపోయింది. అయితే మూవీ టీమ్‌లో ఎవ్వరికీ ఏమీ కాలేదు, ఎవరూ గాయపడలేదు.. త్వరలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేస్తాం.. అని చరణ్ ట్వీట్ చేసాడు.