‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్
మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ హీరోలందరూ కలసి నటించిన సూపర్ హీరోస్ మూవీ ‘అవెంజర్స్.. ఎండ్‌గేమ్’. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ థీమ్ సాంగ్‌ను కంపోజ్ చేశారు.

మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ హీరోలందరూ కలసి నటించిన సూపర్ హీరోస్ మూవీ ‘అవెంజర్స్.. ఎండ్‌గేమ్’. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ థీమ్ సాంగ్‌ను కంపోజ్ చేశారు.
మార్వెల్ కామిక్స్‌లోని సూపర్ హీరోలందరూ కలసి నటించిన సూపర్ హీరోస్ మూవీ ‘అవెంజర్స్.. ఎండ్‌గేమ్’. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ థీమ్ సాంగ్‌ను కంపోజ్ చేశారు. ‘థానోస్’ పాత్రకు రానా వాయిస్ ఓవర్ అందించారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్, థీమ్ సాంగ్‌ను సోమవారం (ఏప్రిల్ 8, 2019)న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే, ఈ సినిమా డబ్బింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ.. ‘మార్వెల్ ప్రయాణం మొదలైనప్పటి నుంచి వాళ్ల సినిమాలు చూస్తున్నాను. సూపర్ హీరో సినిమాలో భాగం అయ్యే అవకాశం రావడం సంతోషంగా ఉంది. డబ్బింగ్ చెబుతున్నప్పుడే థానోస్ పాత్ర నా ఫేవరెట్ అయిపోయింది. అంతేకాదు రెహమాన్ థీమ్ సాంగ్ చేయడం వల్ల పరభాష సినిమాలా కాకుండా సొంత భాష సినిమా అనే ఫీల్ వస్తుంది’ అని అన్నారు.
Read Also : ‘జెర్సీ’ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ కు టైం ఫిక్స్