Raviteja: మాస్ రాజా ఫ్యాన్స్‌కి ‘ధమాకా’ లాంటి న్యూస్.. త్వరలోనే ఆ సీక్వెల్..?

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తన అభిమానులు ఓ ధమాకా న్యూస్ ఇచ్చాడు ఈ హీరో.

Raviteja: మాస్ రాజా ఫ్యాన్స్‌కి ‘ధమాకా’ లాంటి న్యూస్.. త్వరలోనే ఆ సీక్వెల్..?

Raviteja To Do Krack Movie Sequel With Gopichand Malineni

Updated On : December 22, 2022 / 9:50 PM IST

Raviteja: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం ‘ధమాకా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా తన అభిమానులు ఓ ధమాకా న్యూస్ ఇచ్చాడు ఈ హీరో.

తాజాగా రవితేజతో సినిమాలు చేసిన డైరెక్టర్ బాబీ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేనిలతో మాస్ రాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించారు. అయితే తనకు రాజా ది గ్రేట్ వంటి మంచి హిట్ అందించిన అనిల్ రావిపూడితో ఆ సినిమాకు సీక్వెల్‌ను ఖచ్చితంగా తీస్తానని రవితేజ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే తనతో ఇప్పటికే డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి మూడు సినిమాలు చేసిన గోపీచంద్ మలినేనితో త్వరలోనే మరో సినిమా చేస్తానని.. అది క్రాక్ సినిమాకు సీక్వెల్ అవ్వొచ్చంటూ క్లూ ఇచ్చాడు మాస్ రాజా.

Raviteja: నిర్మాతగా కూడా గ్యాప్ ఇవ్వనంటోన్న మాస్ రాజా..!

రవితేజ కెరీర్‌లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా క్రాక్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుందని రవితేజ చెప్పడంతో ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రావాలంటే రవితేజ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేయాల్సి ఉంది.