Rishab Shetty : కాంతార హీరోకి గీత ఆర్ట్స్‌లో సినిమా ఆఫర్ చేసిన అల్లు అరవింద్..

తెలుగులో కాంతార సినిమా భారీ విజయం సాధించి మంచి లాభాలు రావడంతో అల్లు అరవింద్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.............

Rishab Shetty : కాంతార హీరోకి గీత ఆర్ట్స్‌లో సినిమా ఆఫర్ చేసిన అల్లు అరవింద్..

Rishab Shetty gets movie offer from Allu Aravind Geetha arts

Updated On : October 20, 2022 / 11:43 AM IST

Rishab Shetty :  రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సినిమా ‘కాంతార’. KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సెప్టెంబర్ లోనే కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి అక్కడ మంచి కలెక్షన్లని సాధించింది. దీంతో గత వారం తెలుగు, హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేశారు.

ఎవరూ ఊహించని విధంగా తెలుగు, హిందీలో కూడా కాంతారా సినిమా భారీ విజయం సాధించింది. హిందీలో ఒక్క రోజులోనే 5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే తెలుగులో అయిదు రోజుల్లో ఏకంగా 22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమా. తెలుగులో కాంతారా సినిమాని అల్లు అరవింద్ 2 కోట్లకు రైట్స్ కొనుక్కొని రిలీజ్ చేయగా దాదాపు 10 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. మౌత్ టాక్ తోనే సినిమా బాగా పబ్లిసిటీ అవుతుంది. అలాగే స్టార్ హీరోలు సినిమా బాగుందంటూ ట్వీట్స్ చేయడంతో మరింత ప్రమోట్ అవుతుంది.

ఆర్ఆర్ఆర్: జపాన్ లో RRR సందడి.. ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..

తెలుగులో కాంతార సినిమా భారీ విజయం సాధించి మంచి లాభాలు రావడంతో అల్లు అరవింద్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ”మరోసారి కాంతార సినిమా సినిమాలకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. ఎమోషన్ బ్యారియర్ ఒకటే ఉంది అని నిరూపించింది. ఇది మట్టి నుంచి వచ్చిన కథ. ఏ రీమేక్ కాదు. రిషబ్ తన ఊళ్ళో చూసిన కథలని బాగా చూపించారు. తన మట్టి కథ. ఇది విష్ణు తత్త్వం, రౌద్ర తత్త్వం ఉన్న సినిమా. హీరో చాలా బాగా చేశాడని అందరూ చెప్తున్నారు. నేను చెప్పవసర్లేదు. లాస్ట్ లో అరిచిన సీన్ బాగా వైరల్ అయింది. దాని గురించి మాట్లాడాను హీరోతో. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. జాతరలో జరిగే వరిజినల్ సౌండ్స్ రికార్డ్ చేసుకొచ్చి ఈ బ్యాక్ గ్రౌండ్ లో కలిపారు అని చెప్పడంతో చాలా ఆశ్చర్యపోయాను. బన్నీ వాసు ఈ సినిమాని చూడమన్నాడు. సినిమా చూశాక నేను తెలుగులో రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను సాధారణంగా డబ్బింగ్ సినిమాలు చాలా తక్కువ రిలీజ్ చేస్తాను. హీరో పర్ఫార్మెన్స్ నచ్చి ఈ సినిమా రిలీజ్ చేశాను. సినిమా బాగా సక్సెస్ అయింది. రిషబ్ ని గీత ఆర్ట్స్ లో సినిమా చేయమని అడిగాను. రిషబ్ కూడా ఓకే అన్నాడు” అని తెలిపారు. దీంతో రిషబ్ సూపర్ ఛాన్స్ కొట్టేసాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.