చెర్రీ, అలియా ఆటాడుకుంటున్నారు! రొమాంటిక్ సాంగ్ షూట్‌లో ‘RRR’
‘ఆర్ఆర్ఆర్’ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి..

‘ఆర్ఆర్ఆర్’ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను ఫ్రీడమ్ ఫైటర్స్‌గా మార్చి, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే..
తాజాగా ‘‘ఆర్ఆర్ఆర్’’లో హీరోయిన్, విలన్ క్యారెక్టర్స్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తారక్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ కథానాయికగా నటిస్తోంది.. ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తి అయింది.. ప్రస్తుతం చరణ్, ఆలియా భట్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారట.
దీనికోసం ఓ భారీ సెట్‌ని కూడా వేశారని తెలిసింది. ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర ఎక్కువ సేపు ఉండకపోవచ్చని సమాచారం. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.