Jawan : జ‌వాన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్కొ టికెట్ 1500 నుంచి 2400..!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) న‌టిస్తున్న‌ చిత్రం జ‌వాన్ (Jawan). త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌.

Jawan : జ‌వాన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్కొ టికెట్ 1500 నుంచి 2400..!

Jawan

Updated On : September 1, 2023 / 9:35 PM IST

Jawan Advance Ticket Bookings : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) న‌టిస్తున్న‌ చిత్రం ‘జ‌వాన్’ (Jawan). త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుండగా, ప్రియమణి, అమృత అయ్యర్, సన్యా మల్హోత్రా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న హిందీ, త‌మిళం, తెలుగు బాషల్లో విడుద‌ల కానుంది.

Upasana : ఇంత‌కు మించి ఇంకా ఏమీ వద్దు.. ఆనందంలో ఉపాస‌న‌.. క్లీంకార‌ను చూశారా..?

ఈ నేప‌థ్యంలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌ (Advance Ticket Bookings) తాజాగా ప్రారంభం అయ్యాయి. పఠాన్ సినిమా త‌రువాత షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు త‌రణ్ ఆద‌ర్శ్ తెలిపిన వివ‌రాల మేర‌కు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభ‌మైన గంటలోనే 42 వేల టికెట్లు అమ్ముడు పోయాయి. PVR, INOXలో 32,750, సినీపోలిస్‌లో 8,750 టికెట్లు అమ్ముడైన‌ట్లు తెలిపారు.

Yendira Ee Panchayithi : ‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ నుంచి ‘ఏమో ఏమో’ సాంగ్ విడుదల..

ఇదిలా ఉంటే.. బుక్ మై షో ప్ర‌కారం టికెట్ ధ‌ర‌లు అధికంగానే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కొ టికెట్ రూ.1600 నుంచి రూ.2400 వ‌ర‌కు ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, అహ్మ‌దాబాద్‌, చండీగ‌ర్‌, చెన్నై, పూణె వంటి న‌గ‌రాల్లో టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షారుక్ ఖాన్ రెండు పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.