స్టార్ హీరోల సినిమాల మీద రూమర్స్!

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 05:26 AM IST
స్టార్ హీరోల సినిమాల మీద రూమర్స్!

Updated On : April 29, 2019 / 5:26 AM IST

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రూమర్స్ చాలా కామన్. సినిమా పట్టాలెక్కకముందే ఇదే స్టోరీ అంటూ వంద కథలు వినిపిస్తాయి. ఎవరికి వారే సినిమాలకి టైటిల్స్ కూడా పెట్టేస్తారు. ప్రస్తుతం టాలివుడ్ స్టార్ హీరోస్ సినిమాలపై ఇలాంటి రూమర్సే తెగ హల్ చల్ చేస్తున్నాయి.

మహర్షి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి చర్చ మొదలైంది. మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న అప్ కమింగ్ మూవీకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు రూమర్స్ నడుస్తున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న నెక్స్ట్ రెండు సినిమాల్ని కూడా రూమర్స్ వెంటాడుతున్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాకి అలకనంద అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. బన్నీ, వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్ ఐకాన్ మూవీని రూమర్స్ వదిలిపెట్టడం లేదు. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని సినిమా విషాదాంతమవుతుందని మరో రూమర్ కూడా నడుస్తోంది. లేటెస్ట్ గా ఐకాన్ మూవీలో బన్నీ పోలీస్ ఆఫీసర్ అని మైండ్ గేమ్ స్టోరీ అనే వార్తలొస్తున్నాయి.

RRR తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాల మీద ఇప్పటినుంచే రూమర్స్ మొదలయ్యాయి. లేటెస్ట్ గా జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చరణ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడని ఆ కథను చరణ్ కు వినిపించాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ మిస్ చేసుకున్న బోయపాటి శీను ఓ యంగ్ హీరోతో సినిమా చేసేందుకు ట్రై చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలా స్టార్ హీరోల సినిమాలకి సంబంధించి రకరకాల ఇంట్రెస్టింగ్ రూమర్స్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.