Samantha : అఖిల్‌కి సమంత బర్త్ డే విషెస్.. ఏమని చెప్పిందో తెలుసా?

నేడు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) పుట్టినరోజు సందర్భంగా సమంత (Samantha) తన ఇన్‌స్టా ద్వారా విషెస్ తెలియజేసింది. సామ్ ఏ పోస్ట్ చేసిందో తెలుసా?

Samantha : అఖిల్‌కి సమంత బర్త్ డే విషెస్.. ఏమని చెప్పిందో తెలుసా?

Samantha Birthday wishes to Akhil Akkineni with agent poster

Updated On : April 8, 2023 / 12:01 PM IST

Samantha : సమంత, నాగచైతన్యతో (Naga Chaitanya) విడిపోయిన తరువాత కూడా అక్కినేని కుటుంబంతో మంచి సంబంధాలే మెయిన్‌టైన్ చేస్తుంది. ఈ క్రమంలోనే అక్కినేని హీరోలు అఖిల్ (Akhil Akkineni) అండ్ సుశాంత్ సినిమాలకు, పోస్ట్ లకు రెస్పాండ్ అవుతూ పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా నేడు (ఏప్రిల్ 8) అఖిల్ పుట్టినరోజు కావడంతో టాలీవుడ్ లోని సెలబ్రేటిస్ అఖిల్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత కూడా తన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది.

Agent : ఇక వెనక్కి తగ్గేదే లేదంటున్న ”ఏజెంట్” అఖిల్..

అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ (Agent) సినిమాలో నటిస్తున్నాడు. ఆ మూవీ పోస్టర్ ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ”హ్యాపీ బర్త్ డే అఖిల్. ఎంతో ప్రేమతో. ఏజెంట్ కోసం ఎదురు చూస్తున్నా” అంటూ పోస్ట్ వేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. మరి దీనికి అఖిల్ బదులిస్తాడా? లేదా? చూడాలి. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో బన్నీకి కూడా విషెస్ తెలియజేసింది. చాలా కొంతమందే నన్ను ఇన్‌స్పైర్ చేస్తారు. అందులో నువ్వు ఒకడివి అంటూ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Samantha : మరో కొత్త పార్టనర్‌తో వస్తున్న సమంత..

కాగా సమంత ఈ నెల 14న శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాని గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో టైటిల్ రోల్ సమంత ప్లే చేస్తుండగా మలయాళ నటుడు దేవ్ మోహన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ కథలో మరో ముఖ్య పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హని తీసుకున్నారు. ఈ సినిమాతో అల్లు అర్హ వెండితెర అరగేంట్రం చేస్తుంది. దిల్ రాజు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.

Samantha Birthday wishes to Akhil Akkineni with agent poster

Samantha Birthday wishes to Akhil Akkineni with agent poster

Samantha Birthday wishes to Allu Arjun

Samantha Birthday wishes to Allu Arjun