Shah Rukh – Vijay : షారుఖ్, విజయ్‌తో ఒక మల్టీ‌స్టారర్ చేయడం కోసమే.. జవాన్ మూవీలో..

డైరెక్టర్ అట్లీ షారుఖ్, విజయ్‌తో సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఒక మల్టీ‌స్టారర్ చేయడం కోసమే జవాన్ మూవీలో..

Shah Rukh – Vijay : షారుఖ్, విజయ్‌తో ఒక మల్టీ‌స్టారర్ చేయడం కోసమే.. జవాన్ మూవీలో..

Shah Rukh Khan Vijay multistarrer movie in atlee direction

Updated On : September 17, 2023 / 9:20 PM IST

Shah Rukh Khan – Vijay : షారుఖ్ ఖాన్ రీసెంట్ గా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ (Jawan) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రొడక్షన్ లో ఉన్న సమయంలో ఈ సినిమా గురించిన ఒక రూమర్ నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఈ సినిమాలో ఇళయదళపతి విజయ్ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మూవీ టీం సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ గా ఉంచుతుందని చెప్పుకొచ్చారు. అయితే జవాన్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

Skanda : రామ్ పై అభిమానంతో తన బిడ్డకు.. ‘స్కంద’ అనే పేరు పెట్టిన అభిమాని..

కానీ ఈ సినిమాలో విజయ్ గెస్ట్ అపిరెన్స్ మాత్రం కనిపించలేదు. తాజాగా ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో అట్లీని ప్రశ్నించారు. దీనికి దర్శకుడు బదులిస్తూ.. “నేను షారుఖ్ ఖాన్ అండ్ విజయ్ కలిపి ఒక స్క్రిప్ట్ రాస్తాను. అందుకనే విజయ్ ని ఈ మూవీలో క్యామియో కోసం సంప్రదించలేదు. వీరిద్దరితో తీయబోయే మూవీ 1500 కోట్ల బాక్స్ ఆఫీస్ మూవీ అవుతుంది” అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ దసరాకి రావడం కష్టమా.. బ్యాలన్స్ షూట్..!

కాగా అట్లీ ఇప్పడి వరకు మూడు సినిమాలకు దర్శకత్వం వహించగా.. వాటిలో మూడు సినిమాల్లో విజయ్ హీరోగా నటించాడు. జవాన్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత అట్లీ సినిమా ఎవరితో ఉండబోతుంది అంటూ ఆసక్తి నెలకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జవాన్ 2 కూడా ఉంటుంది అంటూ కామెంట్స్ చేశాడు. ఆ సీక్వెల్ ని విక్రమ్ రాథోర్ పాత్రతో తెరకెక్కిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక జవాన్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రిలీజ్ అయిన 10 రోజుల్లో ఈ మూవీ 797.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం 1000 కోట్ల కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతుంది.