కమల్ పార్టీలోకి షకీలా ?

తమిళనాడు : రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర న్యూస్ బయటకొచ్చింది. శృంగార తారగా ముద్ర పడిన షకీలా త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె ఏ పార్టీలో చేరుతారు ? చేరితే ఎన్నికల బరిలో నిలుస్తారా ? అనే చర్చ జరుగుతోంది. తాజాగా కమల్ హాసన్ స్థాపించిన పార్టీలో తాను జాయిన్ అవుతానని షకీలా ప్రకటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. తన అభిమాన నటుడు కమలహాసన్ అని…ఆయన స్థాపించిన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించినట్లు టాక్.
గతంలో ఆమె నటించిన చిత్రాలు అగ్ర హీరోలకు ముచ్చెమటలు పట్టించాయి. తనపై పడిన ఇమేజ్ పొగొట్టుకోవడానికి షకీలా చాలా ట్రై చేసింది. మామూలు సినిమాల్లో నటించిన ఈ తార పొలిటికల్ ఎంట్రీపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఆమె ఆహ్వానాన్ని కమల్ మన్నిస్తారా ? పార్టీలో చేర్చుకుంటారా ? అనేది రాబోయే రోజుల్లో చూడాలి.