5 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

5 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

Updated On : July 15, 2020 / 5:13 PM IST

బిగ్ బాస్ తర్వాత ఫ్యామస్ అయిన సెలబ్రిటీల్లో షెహనాజ్ గిల్ ఒకరు. 13వ సీజన్ కంటెస్టెంట్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 5మిలియన్ కంటే ఎక్కువమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. పంజాబ్ సింగర్ కు సల్మాన్ ఖాన్ రియాలిటీ షోలో అద్భుతమైన పాపులారిటీ దక్కింది. నేటితో ఆమెకు ఉన్న ఫాలోవర్ల సంఖ్య 5మిలియన్లు దాటింది. అంతేకాకుండా శుభాకాంక్షలు, గిఫ్ట్ లతో వరదలా వస్తున్న అభిమానాన్ని తెగ ఫీలైపోతుంది ఈ బ్యూటీ.

షెహనాజ్ కు అభిమానుల నుంచి మేకప్ కేక్ గిఫ్ట్ గా ఇచ్చారు. లిప్ స్టిక్, పౌడర్, రోగ్ లతో కంప్లీట్ సెట్ బహుకరించారు. కానీ, ఈ సింగర్ అభిమానులందరికీ స్పిరిచ్యువల్ గురు బాబా దీప్ సింగ్ జీతో కలిసి ఈ మైలురాయికి చేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అభిమానుల నుంచే ప్రేమ సరిపోతుందని బహుమతుల కోసం ఎటువంటి డబ్బు వెచ్చించవద్దని కోరింది.

ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్లో సిద్ధార్థ్ శుక్లాకు మధ్య కెమిస్ట్రీ వల్లనే ఫ్యామస్ అయింది. బిగ్ బాస్ 13 విన్నర్ సిద్దార్థ్ శుక్లా ఓ మ్యూజిక్ వీడియోలో టోనీ కక్కర్ తో కలిసి కుర్తా పైజామాలో కనిపించాడు. రియాలిటీ షోలో వారిద్దరి కెమిస్ట్రీ గురించి ఓ ఇంటర్వ్యూలో సిద్దార్థ్ కలిసి మాట్లాడిన షెహనాజ్..

‘మా ఇద్దరి బంధం, బిగ్ బాస్ లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. నేను కోరుకున్నట్లే సాగుతుంది. ఎందుకు మిస్ అవ్వాలి. ఫోన్లో మాట్లాడతా. ఎప్పుడైనా మిస్ అయినట్లు అనిపిస్తే నేనూ ఫోన్ చేస్తా’ అని చెప్పుకొచ్చింది.