Shriya Saran: భోళాశంకర్ కోసం భారీగా డిమాండ్ చేసిన శ్రియా.. నిజమేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసేందుకు అందాల భామ శ్రియా సరన్‌ను అప్రోచ్ అయ్యారు మేకర్స్.

Shriya Saran: భోళాశంకర్ కోసం భారీగా డిమాండ్ చేసిన శ్రియా.. నిజమేనా..?

Shriya Saran Quoted Huge Remuneration For Bholaa Shankar Special Song

Updated On : April 29, 2023 / 8:15 AM IST

Shriya Saran: అందాల భామ శ్రియా సరన్ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా తన సత్తా చాటుతూ దూసుకెళ్తోంది. వయసు పైబడుతున్నా, వన్నె తగ్గని అందం శ్రియా సొంతం. ఆమె ఓ బిడ్డకు తల్లి అయినా, వరుస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ బ్యూటీకి హీరోయిన్ పాత్రలు కాకపోయినా, సినిమాలో కీలకంగా ఉండే పాత్రలు దక్కుతున్నాయి.

Shriya Saran : మోడ్రన్ డ్రెస్‌లో శ్రియ సరికొత్త పోజులు..

అయితే, శ్రియా గతంలో కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది. ఇప్పటికీ ఆమెకున్న డిమాండ్ కారణంగా స్పెషల్ సాంగ్స్ చేసేందుకు పలువురు ఫిల్మ్ మేకర్స్ ఆమెను అప్రోచ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేసేందుకు చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో చిందులు వేసేందుకు శ్రియా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Shriya Saran : కూతురితో శ్రియ స్పెషల్ ఫొటోషూట్

అంతమొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. దీంతో వారు ఈ సినిమాలో ఆమెను తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక భోళాశంకర్ మూవీలో చిరు సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.