అడ్డాల దర్శకత్వంలో ‘అసురన్’ రీమేక్
విక్టరీ వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు..

విక్టరీ వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌కు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు..
తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అసురన్’.. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది.. రా కంటెంట్‌తో రియలిస్టిక్‌గా తెరకెక్కిన ‘అసురన్’ చిత్రానికి సెలబ్రిటీల నుండి భారీ స్పందన వస్తోంది.
విక్టరీ వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే.. తమిళ నిర్మాత, వి. క్రియేషన్స్ బ్యానర్ అధినేత కలైపులి థాను, సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించనున్నారు. గత కొద్ది రోజులుగా ఈ రీమేక్ చిత్రానికి దర్శకుణ్ణి వెతికే పనిలో ఉన్నారు.. రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో దర్శకుడి పేరుని అధికారికంగా ప్రకటించారు సురేష్ బాబు..
Read Also : జార్జ్ రెడ్డి సినిమాను అడ్డుకుంటాం : ఏబీవీపీ నేతల అభ్యంతరం
‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ముకుంద’ సినిమాలతో ఆకట్టుకున్న శ్రీకాంత్ అడ్డాల ‘అసురన్’ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారు. ‘అసురన్’ లో తన కుటుంబాన్ని కాపాడు కోవడానికి హీరో చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది.. గతంలో ఇలాంటి పాయింట్‌తో వెంకీ ‘జయంమనదేరా’ చేశాడు.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు తెరకెక్కిస్తాం’ అని సురేష్ బాబు అన్నారు. శ్రియా కథానాయికగా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.