Sukumar: రౌడీ స్టార్‌తో సుకుమార్ మూవీ.. అవన్నీ నమ్మొద్దంటున్న మేకర్స్!

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాను పక్కనబెట్టినట్లుగా ఇటీవల వార్తలు రావడంతో, ఈ సినిమాపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Sukumar: రౌడీ స్టార్‌తో సుకుమార్ మూవీ.. అవన్నీ నమ్మొద్దంటున్న మేకర్స్!

Sukumar Vijay Devarakonda Movie Is Much On

Updated On : April 6, 2023 / 4:59 PM IST

Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తనదైన విధ్వంసకర పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాను ఈయేడాది చివరినాటికి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Sukumar: శిష్యుడి సినిమాపై గురువు కామెంట్.. సంతోషంతో పాటు గర్వంగా ఉందన్న సుకుమార్!

ఇక ఈ సినిమా పూర్తికాక ముందే, సుకుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్టును కన్ఫం చేశారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సుకుమార్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ పక్కనబెట్టినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలు నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుండటంతో.. తాజాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్ రెస్పాండ్ అయ్యింది.

Sukumar Assistants : టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌లు ఇస్తున్న సుకుమార్ స్టూడెంట్స్.. వీళ్లంతా సుకుమార్ శిష్యులే..

ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న నిర్మాతలు ఈ సినిమాను పక్కనబెట్టలేదని తెలిపారు. ఈ సినిమాను అతి త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుందని.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. దీంతో సుకుమార్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మూవీ ఖచ్చితంగా ఉంటుందని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు.