Super Star Krishna : ఎక్స్‌క్లూజివ్.. కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల..

మహేష్ బాబు తండ్రి మరియు టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ 'కృష్ణ' ఈరోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటున్నారు డాక్టర్లు. దాదాపు 12 గంటల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్య బృందం.. తాజాగా కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Super Star Krishna : ఎక్స్‌క్లూజివ్.. కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల..

Super star krishna health bulletin released

Updated On : November 14, 2022 / 3:08 PM IST

Super Star Krishna : మహేష్ బాబు తండ్రి మరియు టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ ‘కృష్ణ’ ఈరోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటున్నారు డాక్టర్లు. దాదాపు 12 గంటల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్య బృందం.. తాజాగా కృష్ణ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

Super Star Krishna: విషమంగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై ఐయూసీలో చికిత్స..

శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు ఈరోజు ఉదయం (14-11-2022) తెల్లవారుజామున 01.15 గంటలకు గుండెపోటుతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో అత్యవసర పరిస్థితిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు 20 నిముషాలు పాటు CPR చేసి, ఆయన్ని కొంతవరకు సేవ్ చేశారు. మరో 24 గంటల పాటు అబ్జర్వేషన్ కోసం ICUకి తరలించారు. మా ప్రయత్నం మేము చేస్తున్నం. 48 గంటలు గడిస్తే గాని ఏ విషయం మేము చెప్పలేము.

ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచాం. కార్డియాలజిస్ట్‌లు, న్యూరాలజిస్ట్‌లు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్‌లు అయన వైద్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా కృష్ణ గారి పరిస్థితిని ఎప్పటికి అప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా అభిమానులు ఎవరూ ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు కోరారు.

Super star krishna health bulletin released

Super star krishna health bulletin released