Kanguva : సూర్య ‘కంగువ’ షూటింగ్ కంప్లీట్.. ‘దేవర’కి పోటీగా రాబోతోందా..?
సూర్య 'కంగువ' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర'కి పోటీగా రాబోతోందా..?

Suriya Kanguva movie shooting complete and it is aiming to release in april
Kanguva : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘కంగువ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. దిశా పటాని హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ‘యానిమల్’ మూవీ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ని సూర్య అభిమానులకు తెలియజేశారు.
కంగువ షూటింగ్ లోని పిక్ షేర్ చేస్తూ.. “కంగువలో నా లాస్ట్ షాట్ పూర్తి అయ్యింది. మొత్తం మూవీ టీం ఎంతో నమ్మకంగా ఉంది. ఇది ఒకదానికి ముగింపు, మరెన్నో వాటికీ మొదలు. ఈ సినిమాని వెండితెర పై చూడడానికి ఎదురు చూస్తున్నాను. నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన శివకి కృతజ్ఞతలు” అంటూ పేర్కొన్నారు. ఇక మూవీ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పై దృష్టి పెట్టింది.
Also read : Guntur Kaaram : ఏపీలో ‘గుంటూరు కారం’ టికెట్ ధర పెంపుకి అనుమతి.. ఎంత పెరిగిందో తెలుసా..?
View this post on Instagram
కాగా ఈ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారట. ఏప్రిల్ 11న ఈ మూవీని విడుదల చేయడానికి మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తమిళ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ తేదికి ఆరు రోజులు ముందు ఏప్రిల్ 5న ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నాయి. దీంతో
పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద తప్పకుండా పోటీ ఉంటుంది.
మరి కంగువ నిజంగానే ఏప్రిల్ 11కే వస్తుందా లేదా అనేది చూడాలి. కాగా ఈ చిత్రం మొత్తం 36 భాషల్లో రిలీజ్ కాబోతుందట. 3D, ఐమాక్స్ ఫార్మేట్స్ లో ఈ సినిమా సిద్దమవుతుంది. ఈ సినిమాలో సూర్య మొత్తం ఆరు పాత్రల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాతలు కూడా బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాతో సమాధానం చెబుతామంటూ కామెంట్స్ చేస్తుండడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది.