Telugu Films Shooting: ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే..?
స్పెయిన్ లో సూపర్ స్టార్ మహేష్ స్టెప్పులేస్తుంటే, ప్రభాస్ రాముడిగానే కంటిన్యూ అవుతున్నాడు. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్, రవితేజ, గోపీచంద్ ఉండగా.. మిగతా హీరోలు..

Telugu Films Shooting (1)
Telugu Films Shooting: స్పెయిన్ లో సూపర్ స్టార్ మహేష్ స్టెప్పులేస్తుంటే, ప్రభాస్ రాముడిగానే కంటిన్యూ అవుతున్నాడు. ఇక అల్యూమినియం ఫ్యాక్టరీ లో పవన్ కళ్యాణ్, రవితేజ, గోపీచంద్ ఉండగా.. మిగతా హీరోలు సెట్స్ లో షూటింగ్స్ సెట్ చేసేస్తున్నారు. ఇలా ఏ హీరోల సినిమాలు ఎక్కడివరకొచ్చాయో.. ఏ సెట్స్ మీద షూటింగ్స్ తో సందడి చేస్తున్నారో చూద్దాం.
Squid Game: రికార్డ్స్ బద్దలు కొడుతున్న స్క్విడ్ గేమ్.. ఎందుకింత క్రేజ్?
ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబయ్ లో జరుగుతోంది. ప్రభాస్ రాముడి గెటప్ లో షూట్ స్పీడప్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెయిన్ లో స్టెప్పులెయ్యడానికి రెడీ అయ్యారు. పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్కారువారి పాట సినిమాకు సంబందించి సాంగ్ షూట్ స్పెయిన్ లో జరుగుతుంది.
Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!
పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో శేఖర్ చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న భిమ్లా నాయక్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. రవితేజ నక్కిన త్రినాథ్ రావు డైరెక్షన్ లో ధమాకా మూవీతో పాటు గోపిచంద్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న పక్కా కమర్షియల్ సినిమా షూటింగ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే చేస్తున్నారు.
Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో డిసెంబర్ రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా పుష్ప లాస్ట్ షెడ్యుల్ యూసఫ్ గూడ లో జరుగుతోంది. నాని నటిస్తున్న అంటే సుందరానికి మూవీ సికింద్రాబాద్ లో జరుగుతుంటే.. నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ నానక్ రామ్ గుడా రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. మరో సీనియర్ హీరో వెంకటేష్ వరుణ్ తేజ్ f3 సినిమా షూటింగ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో కంటిన్యూ అవుతోంది.