Sankranti 2022 : సంక్రాంతి బరిలో..
దసరా, ఇయర్ ఎండ్‌కి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న హీరోల సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి మీద కాన్సన్‌ట్రేషన్ చేశారు..

Sankranti 2022
Sankranti 2022: వరుసపెట్టి రిలీజ్ డేట్స్ ఇస్తున్నారు. టైమ్ చూసుకుని సీజన్లన్నీ బుక్ చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ దసరా, ఇయర్ ఎండ్‌కి రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న హీరోల సినిమాలకు పెద్ద సీజన్ అయిన సంక్రాంతి మీద కాన్సన్‌ట్రేషన్ చేశారు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతి హీరో నేనంటే నేనేనంటున్న స్టార్ హీరోలెవరో, సంక్రాంతి సినిమాలేంటో చూద్దాం.
మొన్న మొన్నటి వరకూ అసలు పరిస్థితి ఎలా ఉంటుందో.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అన్న గ్యారంటీ లేదు.. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కాస్త బెటర్ అవ్వడంతో రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నారు స్టార్లు. లేటెస్ట్‌గా సంక్రాంతి బరిలోకి నేనొస్తానంటూ అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. సాగర్ చంద్ర డైరెక్షన్లో పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌లో పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కాప్‌గా భీమ్లా నాయక్ క్యారెక్టర్‌లో రాబోతున్న పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతి బరిలోకే వస్తున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది టీమ్.
Making Glimpse : పవన్ – రానా.. ఎవరూ తగ్గట్లేదుగా..
సంక్రాంతి బరిలో రిలీజ్ క్లాష్ గట్టిగానే ఉండబోతోంది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాని కూడా సంక్రాంతి బరిలోనే దింపుతున్నట్టు సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నారు. పోయిన సంవత్సరం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ కొట్టిన సూపర్‌స్టార్ తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికే రావడానికి సినిమాని ఫుల్ స్పీడ్‌లో షూట్ చేస్తున్నారు.
ఎంత మంది హీరోలు పోటీపడుతున్నా.. పండగ హీరో నేనే అంటున్నారు బాలయ్య. ఈ నటసింహానికి సంక్రాంతి సక్సెస్ హిస్టరీ బాగానే ఉంది. అందుకే ఎంతమందొచ్చినా, ఎన్ని సినిమాలతో వచ్చినా.. సంక్రాంతి సినిమా నాదే అంటున్నారు. మలినేని గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే ఎయిమ్ చేస్తున్నారు టీమ్.
Akhanda : కుంభకోణంలో ‘అఖండ’ క్లైమాక్స్..
మాస్ మహారాజా రవితేజ కూడా పెద్ద పండక్కి పోటీ పడుతున్నారు. ‘రామారావు.. ఆన్ డ్యూటీ’ అంటూ శరత్ మండవ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతి బరిలోకే దిగుతోంది. సబ్ కలెక్టర్ క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ మూవీగా వస్తున్న ‘రామారావు.. ఆన్ డ్యూటీ’ పెద్ద పండక్కి ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చెయ్యబోతోంది.
రిలీజ్‌కు రెడీగా రెండు సినిమాల్ని పెట్టుకుని ‘అంటే.. సుందరానికి’.. షూట్‌తో బిజీగా ఉన్న నాని కూడా పెద్ద పండగనే ఎయిమ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎలా అయినా ‘టక్ జగదీష్’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాల్ని రిలీజ్ చేసేసి, ‘అంటే.. సుందరానికి’.. మాత్రం సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు నాని. ఇక ‘ఎఫ్ 2’ తో సంక్రాంతి హిట్‌గా సంపాదించిన అనిల్ రావిపూడి కూడా ‘ఎఫ్ 3’ ని సంక్రాంతికే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తున్న దిల్ రాజుకు సంక్రాంతి హిస్టరీ సక్సెస్‌ఫుల్‌గా ఉండడంతో ఈ సినిమాల్ని పెద్దపండక్కే ప్లాన్ చేస్తున్నారు.
Shyam Singha Roy : నాని గుమ్మడికాయ కొట్టేశాడు..
నిన్న మొన్నటి వరకూ కామ్‌గా ఉన్న అక్కినేని హీరో నాగార్జున కూడా నెక్ట్స్ మూవీ సంక్రాంతికే ప్లాన్ చేస్తున్నారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో నాగార్జున చేస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ కానీ, కళ్యాణ్ కృష్ణ – నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘బంగార్రాజు’ సినిమా కానీ సంక్రాంతి పండగ బరిలోకే దింపబోతున్నారు.
బ్లాక్‌బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ కూడా ఈసారి సంక్రాంతినే నమ్ముకున్నాడు. సురేందర్ రెడ్డి – అఖిల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఏజెంట్’ సినిమాని నెక్ట్స్ ఇయర్ పండగ సీజన్‌లోనే ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌కు రెడీగా ఉన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ని రిలీజ్ చెయ్యడానికి టైమ్ కోసం చూస్తున్నారు అఖిల్ అండ్ కో.