బయ్యర్లని సగానికి సగం ముంచేసాడు

ఏరియాల వారీగా వినయ విధేయ రామ నష్టాల వివరాలు..

  • Published By: sekhar ,Published On : January 24, 2019 / 07:39 AM IST
బయ్యర్లని సగానికి సగం ముంచేసాడు

Updated On : January 24, 2019 / 7:39 AM IST

ఏరియాల వారీగా వినయ విధేయ రామ నష్టాల వివరాలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వినయ విధేయ రామ, జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సంక్రాంతికి చరణ్ మంచి గిఫ్ట్ ఇస్తాడని ఆశించిన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు బోయపాటి. రోటీన్ స్టోరీ, ఊరమాస్ యాక్షన్ సీన్లు, ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. మొదటిరోజు మార్నింగ్ షో నుండే ఫ్లాప్ టాక్ వచ్చినా, చరణ్, బోయపాటి బ్రాండ్ వల్ల ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వచ్చాయి. తర్వాత వచ్చిన ఎఫ్2 హిట్ టాక్ తెచ్చుకోవడంతో, వినయ విధేయ రామ థియేట్రికల్ రన్నింగ్ గగనమైపోయింది. దాదాపు రూ.96 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకున్న వీవీఆర్, బయ్యర్లను సగానికి సగం ముంచేసింది. ఏరియాల వారీగా వినయ విధేయ రామ నష్టాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం : రూ. 8.5 కోట్లు
సీడెడ్ : రూ. 10.5 కోట్లు (హైర్స్ ఇష్యూ) లేకపోతే రూ.7.5కోట్లు
కృష్ణా : రూ. 2.5 కోట్లు
గుంటూరు : రూ. 2.5 కోట్లు
నెల్లూరు : రూ. 1.20 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 4.5 కోట్లు
ఈస్ట్, వెస్ట్ : రూ. 4.3 కోట్లు
కర్ణాటక : రూ. 4.5 కోట్లు
ఓవర్సీస్ : రూ. 9 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ లాస్ : రూ.47.50 కోట్లు

వాచ్ న్యూ ప్రోమో…