Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ నుంచి చిరు లీక్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పడంతో ఆయన ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే ఈ సర్‌ప్రైజ్ ఏమిటో చిరు తన ఇన్‌స్టా పేజీలో రివీల్ చేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’లోని ఓ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ నుంచి చిరు లీక్.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్!

Waltair Veerayya Second Song Leaked By Chiranjeevi

Updated On : December 14, 2022 / 6:38 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఇస్తానని చెప్పడంతో ఆయన ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారా అని అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే ఈ సర్‌ప్రైజ్ ఏమిటో చిరు తన ఇన్‌స్టా పేజీలో రివీల్ చేశాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’లోని ఓ సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫ్రాన్స్ వెళ్లిన సంగతి తెలిసిందే.

Waltair Veerayya: సెకండ్ సింగిల్‌ను రెడీ చేస్తోన్న బాస్..?

అక్కడ సాంగ్ షూటింగ్ కోసం వారు ఎంచుకున్న లొకేషన్ గురించే చిరు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వారు ఈ సాంగ్ షూటింగ్‌ను ఆల్ప్స్ పర్వత లోయల్లో ఉన్న ఒక అందమైన ప్రాంతంలో చేశామని.. అక్కడి అందాలను చూసి తాను చాలా ఎగ్జైట్ అయ్యానంటూ చిరు చెప్పుకొచ్చారు. అక్కడ కురుస్తున్న మంచులో సాంగ్ షూట్ చేసేందుకు చాలా కష్టపడ్డామని.. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఎంతో కష్టపడి ఈ సాంగ్ షూట్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అక్కడి అందాలకు తాను ముగ్ధుడినయ్యానని.. అందుకే తన సెల్‌ఫోన్‌లో ఆ అందాలను బంధించి తన అభిమానులకు అందిస్తున్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్.. దుమ్ము దులిపేసిన రవితేజ..

ఇక చివరగా.. వాల్తేరు వీరయ్య నుంచి ఓ లీక్ ఇస్తున్నానంటూ.. తాము షూటింగ్ జరుపుకున్న సాంగ్‌కు సంబంధించి ఓ బిట్‌ను లీక్ చేశారు చిరు. ‘‘నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవంటా’’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు చిరు చెప్పుకొచ్చారు. అభిమానులు ఈ బిట్‌ను ఎంజాయ్ చేస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఏదేమైనా చిరు లీక్స్ నుండి తాజాగా మరోటి బయటకు రావడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)