Waltair Veerayya: సెకండ్ సింగిల్‌ను రెడీ చేస్తోన్న బాస్..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో చాలా రోజుల తరువాత మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్, పార్టీ సాంగ్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Waltair Veerayya: సెకండ్ సింగిల్‌ను రెడీ చేస్తోన్న బాస్..?

Second Song From Chiranjeevi Waltair Veerayya To Be Out Soon

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో చాలా రోజుల తరువాత మెగాస్టార్ ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్, పార్టీ సాంగ్ ఇప్పటికే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్.. దుమ్ము దులిపేసిన రవితేజ..

కాగా, తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న మాస్ రాజా రవితేజ పాత్రకు సంబంధించిన ఇంట్రో టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్‌ను రెండో సింగిల్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యిందట.

Waltair Veerayya : మేస్త్రి టు వీరయ్య.. మాస్ జాతరకు 30 ఏళ్ళు..

అయితే ఈ పాటను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ సాంగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.