Vijay Devarakonda: మీ ఊరొస్తా.. మీతో కలిసి లంచ్ చేస్తా.. ఫ్యాన్స్‌కి విజయ్ వరాలు!
విజయ్ దేవరకొండ ఫుల్ చిల్ అవుతున్నాడు. మొన్నటి వరకూ హెక్టిక్ షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. ఫ్రీ టైమ్ దొరకడంతో ఫ్యాన్స్ ని పలకరిస్తూ.. మీ ఊరొస్తా..

Vijay Devarakonda
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫుల్ చిల్ అవుతున్నాడు. మొన్నటి వరకూ హెక్టిక్ షూటింగ్ తో బిజీగా ఉన్న ఈ రౌడీ హీరో ఇప్పుడు ఫ్రీ అయ్యాడు. ఫ్రీ టైమ్ దొరకడంతో ఫ్యాన్స్ ని పలకరిస్తూ.. మీ ఊరొస్తా.. మీ ఇంటికి భోజనానికొస్తా.. మీతో కలసి సినిమా చూస్తా అంటూ తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు ఈ క్రేజీ హీరో.
Liger: మరింత ఆలస్యంగా రానున్న రౌడీ హీరో.. కారణం ఏంటంటే?
మొన్నటి వరకూ లైగర్ షూట్ లో ఒళ్లు హూనం చేసుకున్న ఈ రౌడీ హీరో ఇప్పుడు షూట్ కి బ్రేక్ తీసుకున్నాడు. పూరీ జగన్ డైరెక్షన్లో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న లైగర్ మూవీ గోవాలో హెక్టిక్ షూటింగ్ కంప్లీట్ చేసింది. ఈ షూటింగ్ తో మెంటల్ గా, ఫిజికల్ గా బాగా కష్టపడ్డాను. మొత్తానికి ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని సోషల్ మీడియాలో షేర్ చేశాడు విజయ్.
Liger-Mike Tyson: కలలో కూడా ఊహించలే.. తెలుగు తెరకి మరో ఘనత!
ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ విషయంలో కనెక్టెడ్ గా ఉండి, ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేసే విజయ్ .. ఈసారి బాగా గ్యాప్ రావడంతో వాళ్లని కలవడానికి ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అందుకే సోషల్ మీడియాలో తనను కలవాలనుకుంటున్న ఫ్యాన్స్ కి వస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ రిప్లై ఇస్తున్నారు. ఓ డైహార్డ్ ఫ్యాన్ ప్రభాస్, విజయ్ దేవరకొండ వీడియోస్ ని ఎడిట్ చేస్తే.. ఈ వీడియో చూసి అబ్బా ఏం చేశావ్ తమ్ముడు .. నిన్ను ప్రభాస్ అన్న దగ్గరికి తీసుకెళ్తా అంటూ తెగ వరాలిచ్చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Liger: లైగర్‌కు రూ.200 కోట్లు ఆఫర్.. అబ్బే చాలదంటున్న విజయ్!
విజయ్ దేవరకొండ ధియేటర్ చూడడానికొచ్చిన ఈ అభిమానిని పర్సనల్ గా కలిసి.. సినిమా చూస్తానని ప్రామిస్ చేశాడు విజయ్. అంతేకాదు.. ఎప్పటినుంచో విజయ్ ని కలవడానికి చూస్తున్న మరో మహబూబ్ నగర్ అభిమానికి ఈ సారి మీ ఇంటికొచ్చి మీ ఇంట్లోనే భోజనం చేస్తా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.