Tollywood Star Hero’s: స్టార్ హీరోలకు జీరో ఇయర్‌గా నిలిచిన 2021!

2021 రివైండ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ ఏడాది చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అని ప్రకటించినా..

Tollywood Star Hero’s: స్టార్ హీరోలకు జీరో ఇయర్‌గా నిలిచిన 2021!

Tollywood Star Hero's

Updated On : December 21, 2021 / 1:14 PM IST

Tollywood Star Hero’s: 2021 రివైండ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ ఏడాది చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అని ప్రకటించినా కరోనా భయంతోనో, పోటీ వద్దనుకోనో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నింటిని వాయిదా వేసారు. దీంతో కొంతమంది స్టార్ హీరోల కెరీర్ లో 2021 సంవత్సరం జీరో రిలీజ్ ఇయర్ గా నిలిచింది.

New Film Releases: లక్కీ ఛాన్స్.. ఈ వారం నానీ, రణ్వీర్‌లదే..!

ఈ ఇయర్ జీరో.. నెక్ట్స్ ఇయర్ రఫ్పాడిస్తామంటున్నారు కొంతమంది టాలీవుడ్ స్టార్స్. ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డా.. వచ్చే ఏడాది వాళ్ల ఫేవరెట్ హీరోల సినిమాలు రిలీజవుతూ ఉండటంతో ఖుషీగా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలేవీ 2021లో రిలీజ్ కాలేదు. అయితే 2022 సంవత్సరం జనవరి 7న ఈ ఇద్దరు హీరోలు కలిసి సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోతున్నారు.

RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఈ ఏడాది నో రిలీజ్. అయితే వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మహేష్ నటించిన సర్కారు వారి పాట డేట్ ఫిక్స్ చేసుకుంది. మరో స్టార్ ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. 2022 సంక్రాంతికి రాధేశ్యామ్ రాబోతుండగా ఆదిపురుష్, సలార్ లు కూడా నెక్ట్స్ ఇయర్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఓ గ్లోబల్ స్టార్.. ఒకే ఏడాది మూడు సినిమాలతో రావడమంటే మామూలు విషయం కాదు. సో 2022 మామూలుగా ఉండందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Malavika Mohanan: కట్టు జారిపోతా ఉంది హొయ్.. చీరకట్టు జారిపోతా ఉంది!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అయితే సీనియర్ స్టార్స్ బాలయ్య, వెంకీ, నాగ్ సినిమాలు మాత్రం ఈ ఏడాది రిలీజయ్యాయి. నెక్ట్స్ ఇయర్ నాదే అన్నట్టు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు మెగాస్టార్. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కాబోతుండగా గాడ్ ఫాదర్, భోళాశంకర్ కూడా మెగాఫ్యాన్స్ ను 2022లో పలకరించే అవకాశాలున్నాయి.

Bajrangi Bhaijaan 2: టాలీవుడ్ మీద కన్నేసిన సల్మాన్.. తెలుగు రైటర్‌తో మరో సినిమా!

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. కానీ ఫ్యాన్స్ కు ఎప్పుడూ కనెక్టింగ్ లోనే ఉన్నాడు. యంగ్ హీరోల్లో వరుణ్ తేజ్, సిద్ధార్ధ్, అల్లు శిరీష్ వంటి వాళ్లు కూడా థియేటర్స్ కనీసం ఓటీటీల్లో కూడా సందడి చేయలేదు. ఈ హీరోలు జీరో రిలీజ్ స్టార్స్ గా మిగిలిపోగా ఈ హీరోల సినిమాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూడాలి.