Covid Brain Disease: కొవిడ్ కారణంగా 13ఏళ్ల చిన్నారికి అరుదైన బ్రెయిన్ జబ్బు
కొవిడ్ కారణంగా అరుదైన బ్రెయిన్ జబ్బుకు గురయ్యాడు 13ఏళ్ల చిన్నారి. కర్నాటకలోని దేవంగిరి జిల్లాకు చెందిన అతనిపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపించింది.

Covid 19
Covid Brain Disease: కొవిడ్ కారణంగా అరుదైన బ్రెయిన్ జబ్బుకు గురయ్యాడు 13ఏళ్ల చిన్నారి. కర్నాటకలోని దేవంగిరి జిల్లాకు చెందిన అతనిపై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపించింది. రాష్ట్రంలోనే ఇది తొలి కేసుకాగా, దేశంలో ఇలాంటి కేసు నమోదుకావడం ఇది రెండోసారి. అతనికి నెక్రోటైజింగ్ ఎంసిఫాలోపెథీ ఆఫ్ చైల్డ్‌హుడ్ సమస్యతో ఎనిమిది రోజుల క్రితం హాస్పిటల్ లో చేరాడు.
పేషెంట్ కు మరో వారం ట్రీట్మెంట్ అవసరం.. అతని బ్రెయిన్ రికవరీని పరీక్ష చేయాల్సి ఉంది ట్రీట్మెంట్ అంతా చాలా కాస్ట్లీగా నడుస్తుంది. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.75వేల నుంచి రూ.లక్ష వరకూ ఉంది’ అని కలప్పనవర్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చెప్పారు.
ఎన్విరాన్మెంటల్ అంశాలతో పాటు జెనెటిక్ అంశాలు కూడా తోడై ఇలాంటి సమస్యలు రావొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ అయిన జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వచ్చి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. కోమాలోకి వెళ్లిపోవడం, లివర్ సమస్యలు, న్యూరలాజికల్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు.. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత అధిక ఉష్ణోగ్రత వద్ద వచ్చిన జ్వరం కారణంగా ఊపిరితిత్తుల సమస్య, బ్లాక్ ఫంగస్, ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రావొచ్చని చెబుతున్నారు. కొందరు కొవిడ్ పేషెంట్లు ఐసీయూకి వెళ్లి కోలుకుంటుండగా మరికొందరు ట్రీట్మెంట్ లోనూ ప్రాణాలు కోల్పోతున్నారు.