Minor Rape Married Woman : ఇంట్లోకి దూరి.. 25ఏళ్ల వివాహితపై మైనర్ అత్యాచారం

బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో కుర్రాళ్లు పెడదోవ పడుతున్నారు. చేయకూడని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. సభ్యసమాజం విస్తుపోయేలా వ్యవహరిస్తున్నారు.

Minor Rape Married Woman : ఇంట్లోకి దూరి.. 25ఏళ్ల వివాహితపై మైనర్ అత్యాచారం

Minor Rape Married Woman

Updated On : June 22, 2021 / 9:48 AM IST

Minor Rape Married Woman : బుద్ధిగా చదువుకోవాల్సిన వయసులో కుర్రాళ్లు పెడదోవ పడుతున్నారు. చేయకూడని నేరాలు, ఘోరాలు చేస్తున్నారు. సభ్యసమాజం విస్తుపోయేలా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మైనర్(17) కుర్రాడు దురాఘాతానికి ఒడిగట్టాడు. వివాహితపై అత్యాచారం చేశాడు.

భోపాల్ లోని నజీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూన్ 16న మహిళ ఇంట్లోకి చొరబడిన మైనర్.. అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలి భర్త వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమెకు ఓ కూతురు ఉంది. బాధితురాలు జరిగినదంతా కుటుంబసభ్యులకు చెప్పింది. నజీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మైనర్ కు 17ఏళ్లు ఉంటాయి. అతడు మహిళ ఇంటి పక్కనే ఉంటాడు. ఆమెపై కన్నేసిన మైనర్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. వివాహితను ఓ యువకుడు రేప్ చేశాడు. దాన్ని వీడియో కూడా తీశాడు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలు మార్లు అత్యాచారం చేశాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. అత్తింటి వారు తనను వేధించే వారని, సాయం పేరుతో నిందితుడు తనకు దగ్గరయ్యాడని, పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది.