corona cases increase : ఇండియాలో కరోనా విశ్వరూపం : ఒక్క రోజులో 35,871 కొత్త కేసులు

ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 వేల 871 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణయింది.

corona cases increase : ఇండియాలో కరోనా విశ్వరూపం : ఒక్క రోజులో 35,871 కొత్త కేసులు

Corona Cases Increase

Updated On : March 18, 2021 / 11:28 AM IST

corona cases increase in India : ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 వేల 871 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణయింది. 172 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 102 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం కేసుల్లో 64 శాతం ఒక్క మహారాష్ట్రలోనే బయటపడ్డాయి. అక్కడ ఒక్క రోజు వ్యవధిలో 23 వేల 179 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. సెప్టెంబరు 17 తర్వాత అక్కడ నమోదయిన అత్యధిక కేసులు ఇవే కావడం ఆందొళన కలిగిస్తోంది. అంటే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ రేంజ్‌ కేసులు పెరగాయి. మొన్నటితో పోల్చితే పాజిటివ్ కేసులు 30 శాతం పెరిగాయి.

మహారాష్ట్రలోని పలు నగరాల్లో భారీ సంఖ్యలో కేసులు బయటపడతున్నాయి. ఒక్క నాగ్‌పూర్‌ సిటీలో నమోదయిన కేసుల పంజాబ్‌లో కంటే ఎక్కువగా ఉండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. నాగ్‌పూర్‌లో 2 వేల 698 పాజిటివ్‌ కేసులు రికార్డవ్వగా.. పంజాబ్‌లో 2 వేల 39 కేసులు నమోదయ్యాయి. కరోనా మొదలైన తర్వాత నాగ్‌పూర్‌లో నమోదయిన అత్యధిక కేసులు ఇవే. ఏకంగా ముంబై కంటే ఎక్కువ కేసులు నమోదవడం కలవర పెడుతోంది. ముంబైలో ఒక్క రోజు వ్యవధిలో 2 వేల 377 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మార్చి 1తో పోల్చితే ముంబైలో మూడు రెట్లు అధికంగా కేసులు రికార్డయ్యాయి.

ఇక గుజరాత్‌లో వెయ్యి 122, కేరళలో 2 వేల 98, కర్ణాటకలో వెయ్యి 275 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. తమిళనాడు 945, చత్తీస్‌గఢ్ 887, మధ్యప్రదేశ్ 832, హరియాణా 55, ఢిల్లీ 536, రాజస్థాన్ 313, బెంగాల్ 303, యూపీ 261, తెలంగాణ 247, చండీగఢ్ 201, హిమాచల్ ప్రదేశ్ 167, జమ్మూ కశ్మీర్ 126, ఉత్తరాఖండ్ 110, పుదుచ్చేరి 52 కేసులు బయటపడ్డాయి.

మరోవైపు ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఢిల్లీలో ఒక్క వారానికి ఇంకో వారానికి పాజిటివ్ కేసులు 43 శాతం మేర పెరుగుతున్నాయి. మరణాల్లోనూ 37 శాతం పెరుగుదల నమోదవుతోంది. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలోని మొత్తం 70 జిల్లాల్లోనే పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి 15 మధ్య 150 శాతం మేర రోజువారీ కేసులు పెరిగాయి. ఇందులో పశ్చిమ, ఉత్తర భారతలోని జిల్లాలే అధికం. మహారాష్ట్రలో పాజిటివ్ రేటు జాతీయ సగటును మించి ఉంది.