కేరళలో కొత్త వైరస్ : పిల్లలు చచ్చిపోతున్నారు, ఆందోళనలో ప్రజలు

కేరళలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నిఫా వైరస్ బారినపడిన కేరళ ప్రజలు కోలుకునేలోపే ‘వెస్ట్ నైల్’ అనే కొత్త వైరస్ విజృంభించింది.

  • Published By: sreehari ,Published On : March 18, 2019 / 07:35 AM IST
కేరళలో కొత్త వైరస్ : పిల్లలు చచ్చిపోతున్నారు, ఆందోళనలో ప్రజలు

కేరళలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నిఫా వైరస్ బారినపడిన కేరళ ప్రజలు కోలుకునేలోపే ‘వెస్ట్ నైల్’ అనే కొత్త వైరస్ విజృంభించింది.

కేరళలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నిఫా వైరస్ బారినపడిన కేరళ ప్రజలు కోలుకునేలోపే ‘వెస్ట్ నైల్’ అనే కొత్త వైరస్ విజృంభించింది. ఈ వైరస్ సోకిన ఏడేళ్ల బాలుడు సోమవారం (మార్చి 18, 2019) మృతిచెందాడు. మలప్పరం జిల్లాకు చెందిన ముహమ్మద్ షాన్ (7) బాలుడు కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఇటీవల వైద్యులు బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా వెస్ట్ నైల్ వైరస్ పాజిటీవ్ గా నిర్ధారించారు. బాలుడిని కజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
Read Also : ఎండలు పెరుగుతున్నా తగ్గని స్వైన్ ఫ్లూ : పెరుగుతున్న కేసుల సంఖ్య

కేరళలో తొలి కేసు :
కేరళ రాష్ట్రంలో నమోదైన ఇదే తొలి కేసుగా అధికారులు తెలిపారు. దీంతో కేరళ నార్త్ మలబార్ రీజియన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తిపై మలప్పరం డిప్యూటీ అధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ.. వైరస్ సోకిన బాలుడు సోమవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో మృతిచెందినట్టు వెల్లడించారు. వెస్ట్ నైల్ వైరస్ దోమల వల్ల వ్యాప్తి చెందుతుందని వైద్యులు భావిస్తున్నారు. 2018లో కూడా దోమల వల్ల ఇలాంటి కేసులు ఎన్నోనమోదైనట్టు ఆయన తెలిపారు. వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ వ్యాప్తి చెందడం సాధ్యం కాదని చెప్పారు.

నో వ్యాక్సీన్.. 
కొత్త వైరస్ వెస్ట్ నైల్ ను నిరోధించడానికి ప్రస్తుతానికి ఎలాంటి వ్యాక్సీన్ లేదని అన్నారు. వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి వైరస్ లక్షణాలు బట్టి ట్రీట్ మెంట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తిపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నుంచి ఇద్దరు సభ్యులతో కూడిన నిపుణుల బృందం మలప్పరం ప్రాంతాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని ఎలా కంట్రోల్ చేయలి అనేదానిపై రాష్ట్ర అధికారులకు సూచనలు చేస్తున్నారు. 

వైరస్ లక్షణాలు ఇవే.. 
* కామన్ కోల్డ్ 
* ఫీవర్
* ఒళ్లు నొప్పులు
* తలనొప్పి
* వాంతులు
* వికారం
* అలసట
Read Also : స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి