LOCలో కాల్పులు…8మంది పాక్ సైనికులు మృతి..ఉగ్ర స్థావరాలు ధ్వంసం

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 06:00 PM IST
LOCలో కాల్పులు…8మంది పాక్ సైనికులు మృతి..ఉగ్ర స్థావరాలు ధ్వంసం

Updated On : November 13, 2020 / 6:40 PM IST

8 Pakistani soldiers killed by Indian Army in retaliatory firing along LoC నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాక్ కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ జవాన్ల కాల్పులను భారత సైనికులు ధీటుగా తిప్పికొట్టారు. ఈ క్రమంలో దాదాపు 8మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో 10మంది పాక్ సైనికులు గాయపడినట్లు కూడా సమాచారం. పెద్ద సంఖ్యలో పాక్ ఆర్మీ బంకర్లు,ఫ్యూయల్ డంప్స్,లాంఛ్ ప్యాడ్ లను నాశనం చేసినట్లు తెలిపారు.



పాక్ కాల్పులను తిప్పికొట్టే క్రమంలో ముగ్గురు పాకిస్తాన్ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్(SSG)కమాండోలు కూడా చనిపోయినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. భారత్ లోకి చోరబడేందుకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ,SSG కమాండోలు సహాయసహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే.



కాగా, జమ్మూకశ్మీర్ లోని రెండు వేర్వేరు లొకేషన్లలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై పాక్ కాల్పులకు తెగబడిన నేపథ్యంలో పాక్ కు ఈ విధంగా బుద్ది చెప్పారు భారత సైనికులు. పాక్ జరిపిన కాల్పుల్లో మొత్తం నలుగురు జవాన్లు అమరులైనట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు పౌరులు కూడా మృతిచెందినట్లు తెలిపారు.