Viral Video: కారుతో ఢీకొట్టి 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దొంగలు

గత రాత్రి బీజేంద్ర కారును కొందరు దొంగలు చోరీ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది. వారిని అడ్డుకునే క్రమంలో బీజేంద్రను దొంగలు ఇలా ఈడ్చుకెళ్లినట్లు..

Viral Video: కారుతో ఢీకొట్టి 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన దొంగలు

Viral Video

Updated On : October 11, 2023 / 3:26 PM IST

Delhi: ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిపాల్‌పూర్‌లో ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రోడ్ నంబరు ఎన్‌హెచ్ 8లో ఓ వ్యక్తి తీవ్రగాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

దీనిపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 302, 201 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుడు తీవ్రగాయాలతో మృతి చెందినట్లు తెలుస్తోంది. బాధితుడు ట్యాక్సీ డ్రైవర్ అని ఓ జాతీయ మీడియా పేర్కొంది. అతడి పేరు బీజేంద్ర అని, ఫరీదాబాద్ లో అతడు నివసిస్తున్నాడని చెప్పింది.

గత రాత్రి బీజేంద్ర కారును కొందరు దొంగలు చోరీ చేయడానికి ప్రయత్నించారని తెలిపింది. వారిని అడ్డుకునే క్రమంలో బీజేంద్రను దొంగలు ఇలా ఈడ్చుకెళ్లినట్లు పేర్కొంది. ఢిల్లీలో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మేలో ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్ దాదాపు మూడు కిలో మీటర్ల మేళ ఈడ్చుకెళ్లాడు.

Bhadradri Kothagudem : పుస్తకాలు కొనేందుకు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మహత్య